Home Film News Dilraju Party: దిల్ రాజు కొడుకు బ‌ర్త్‌డే పార్టీలో వైట్ అండ్ వైట్‌లో అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు, సితార‌..!
Film News

Dilraju Party: దిల్ రాజు కొడుకు బ‌ర్త్‌డే పార్టీలో వైట్ అండ్ వైట్‌లో అద‌ర‌గొట్టిన మ‌హేష్ బాబు, సితార‌..!

Dilraju Party: టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒక‌రైన  దిల్ రాజు.. నితిన్‌తో తీసిన దిల్ సినిమాతో త‌న ఇంటిపేరుని దిల్‌గా మార్చుకున్నారు.  వీవీ వినాయక్ దర్శకత్వంలో దిల్ సినిమా తెర‌కెక్క‌గా, ఈ చిత్రం దిల్ రాజుకి తొలి సినిమా. ఈ మూవీ అత‌నికి  కాసుల వర్షాన్ని కురించింది. అంతేకాదు ఈ చిత్రం ఇంటిపేరుగా పెట్టుకునేంత గా గుర్తింపు తీసుకువచ్చింది. అప్ప‌టి నుండి  దిల్ రాజుగా మారిన ఈయన చిన్న సినిమాల‌తో పాటు పెద్ద సినిమాలు చేస్తూ ఇండ‌స్ట్రీకి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందిస్తున్నారు. కెరీర్ స‌జావుగా సాగుతున్న‌ప్ప‌టికీ ఆయ‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో పెద్ద విషాద‌మే చోటు చేసుకుంది.

కొన్నేళ్ల క్రితం దిల్  రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో మరణించింది. ఆ త‌ర్వాత దుఃఖంలో మునిగిపోయిన దిల్ రాజు చాలా రోజుల  పాటు సింగిల్‌గానే ఉన్నారు. క‌రోనా స‌మ‌యంలో  మరో వివాహం చేసుకున్నాడు.  దూరపు బంధువు అయిన తేజస్విని రెండో పెళ్లి చేసుకోగా, గ‌త ఏడాది వీరికి బాబు కూడా జన్మించాడు.  50 ఏళ్ళ వయసులో దిల్ రాజు మరోసారి తండ్రి కావ‌డం హాట్ టాపిక్ అయింది. ఇక జూన్ 29తో బాబు పుట్టి ఏడాది కావ‌డంతో దిల్ రాజు త‌న కుమారుడి బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జేఆర్సీ క‌న్వెన్ష‌న్ హాల్‌లో గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ వేడుక‌కి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు భారీగా త‌ర‌లి వ‌చ్చారు.

టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన అగ్రనటులతో పాటు, చాలామంది దర్శకులు, సాంకేతిక నిపుణులు, ఇతర నిర్మాతలు సైతం ఈ వేడుక‌కి హాజ‌ర‌య్యారు. అయితే వేడుక‌లో మ‌హేష్ బాబు, అత‌ని కూతురు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.   వైట్ కలర్ దుస్తుల్లో వారిద్ద‌రు ఈవెంట్‌లో కనిపించి సందడి చేసారు.  మహేష్, సితార అలా న‌డుచుకుంటూ వ‌స్తుంటే వారిద్ద‌రిని త‌మ కెమెరాల‌లో బంధించారు. ప్ర‌స్తుతం సితార‌, మ‌హేష్ బాబుల‌కి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. దిల్ రాజు, మహేష్ బాబు కాంబినేష‌న్‌లో ప‌లు చిత్రాలు రాగా, ఈ చిత్రాలు పెద్ద విజ‌యాలు సాధించాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...