Home Film News Ileana: త‌న బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో చెప్పిన ఇలియానా.. క‌ష్టాల‌లో కన్నీళ్లు తుడిచాడంటూ కామెంట్
Film News

Ileana: త‌న బిడ్డ‌కు తండ్రి ఎవ‌రో చెప్పిన ఇలియానా.. క‌ష్టాల‌లో కన్నీళ్లు తుడిచాడంటూ కామెంట్

Ileana: గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా హిందీ పరిశ్రమలోను స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేసింది. అవి బెడిసి కొట్టాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోలకు జోడిగా ప‌లు సినిమాలు న‌టించిన కూడా అవి ఈ అమ్మ‌డికి ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. ఇటీవ‌లి కాలంలో సినిమాలు పూర్తిగా త‌గ్గించి సోష‌ల్ మీడియాలోనే తెగ సంద‌డి చేస్తూ కనిపించింది. అయితే ఆ మ‌ధ్య త‌న బేబి బంప్ ఫొటోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి షాకిచ్చింది ఇలియానా. దీంతో అంద‌రు షాక్ అయిపోయారు. అంతేకాదు ఆమె ప్రియుడు ఎవరనే దానిపై జోరుగా చ‌ర్చ‌లు కూడా చేశారు.

ఇన్ని రోజులు త‌న ప్రియుడు ఎవ‌ర‌నే దానిపై మౌనం పాటించిన ఇలియానా తాజాగా ఓ పోస్ట్ చేసి అత‌ని గురించి తెలియ‌జేసింది. అతడు తనను ఎలాంటి పరిస్థితుల్లో కలిశాడో, త‌న‌కు ఎంత‌గా ఉన్నాడో చెప్పుకొచ్చింది. అయితే అత‌ని పేరు, వివ‌రాలు లాంటివి మాత్రం వెల్లడించకుండా కేవ‌లం ఓ ఫొటో షేర్ చేసింది. ఫొటోలో తన ప్రియుడి ముఖాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్ర‌త్తలు తీసుకుంది ఇలియానా. అంతేకాదు ఓ ఎమోషనల్ క్యాప్షన్ కూడా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది.

నేను తీవ్రమైన వేదనలో ఉన్న‌ప్పుడు, నా పట్ల నేను దయగా ఉండడం మరిచిన రోజుల్లో ఆ వ్యక్తి (ప్రియుడు) అండ‌గా ఉన్నాడు. నా హృదయం ముక్కలైందని భావించిన స‌మ‌యంలో ఆ వ్య‌క్తి నన్ను ఓదార్చాడు. నా వెన్నంటే ఉన్నాడు. కన్నీళ్లను తుడిచి, న‌న్ను న‌వ్వించాడు. ఎన్నో జోకులను వేశాడు. నాకు క‌ష్టాల‌లో తోడుగా ఉన్నాడు. ఆ సమయంలో నాకు కావాల్సింది అదేనని అతడికి తెలుసు అంటూ ఇలియానా అత‌ని గురించి గొప్ప‌గా చెప్పుకొచ్చింది. అయితే అత‌డి వివ‌రాల‌ని మాత్రం చాలా గోప్యంగా ఉంచింది.ఈ పోస్ట్ చూశాక త‌న ప్రియుడు అంటే ఇలియానాకి అంత ప్రేమ ఉందా అని ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే క‌త్రినా కైఫ్ సోద‌రుడితోనే ఇలియానా డేటింగ్ చేస్తుంద‌ని కొంద‌రి అభిప్రాయం. దీనిపై అయితే పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...