Home Film News Star Heroine: ల‌లితా జ్యువెల‌రీ ఓనర్ అంత పెద్ద కోటీశ్వ‌రుడు కావ‌డం వెన‌క ఆ స్టార్ హీరోయిన్ హ‌స్తం ఉందా?
Film News

Star Heroine: ల‌లితా జ్యువెల‌రీ ఓనర్ అంత పెద్ద కోటీశ్వ‌రుడు కావ‌డం వెన‌క ఆ స్టార్ హీరోయిన్ హ‌స్తం ఉందా?

Star Heroine: ‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలాగ్  మ‌న‌కు వినిపిస్తే ముఖంపై చిరు న‌వ్వు, ఆయ‌న ప్ర‌తిబింబం క‌ళ్ల ముందు క‌ద‌లాడుతుంది. ఆయ‌న గురించి ప్ర‌త్యేక‌మైన ఏవీలు, ఎలివేష‌న్స్ ఏమి అవ‌స‌రం లేదు. త‌న‌కి తానే స్పెష‌ల్ ఏవీ వేసుకొని తెలుగు రాష్ట్రాల‌లో తెగ పాపుల‌ర్ అయ్యారు. మ‌రి ఆయ‌న మ‌రెవ‌రో కాదు ప్ర‌ముఖ వ్యాపారవేత్త లలితా జ్యువెల్లరీ ఎండీ కిరణ్ కుమార్ . సెలబ్రిటీలకు కోట్లు ఖర్చు పెట్టి ఆ భారాన్ని ప్రజల మీద వేయడం క‌న్నా.. ఆ కోట్లను ప్రజలకే ఆభరణాల రూపంలో తగ్గించి ఇస్తే బాగుంటుంది కదా  అనే ఆలోచ‌న చేసి విప్ల‌వాత్మ‌క వ్యాపార‌వేత్త‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించారు. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు 51 బ్రాంచ్‌లు ఓపెన్ చేసిన ఆయ‌న రానున్న రోజుల‌లో మ‌రిన్ని బ్రాంచ్‌లు ఓపెన్ చేసే ఆలోచ‌న చేస్తున్నాడు.

ఒక‌ప్పుడు చాలా సాదా సీదాగా బ్ర‌తికిన వ్య‌క్తి ఇప్పుడు ఇన్ని  కోట్లకు అధిపతి అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని ఇంటర్వ్యూలో వెల్లడించారు.  నాకు హీరోయిన్ సావిత్రి అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయ‌న ఆమె మీద ఉన్న ప్రేమతోనే సావిత్రికి వాళ్ల ఫ్యామిలీ క‌ట్టించిన ఇంట్లో చాలా రోజుల పాటు అద్దెకు ఉన్నార‌ట‌. అందులో ఉంటున్న‌ప్పుడే త‌న‌కు వ్యాపారం చాలా కలిసి వ‌చ్చింద‌ట‌. ఇక ఓ సంద‌ర్భంలో వారు ఇల్లు అమ్మెస్తా అని చెప్పిన‌ప్పుడు ఆ ఇల్లు తానే కొనుగోలు చేస్తాన‌ని అన్నాడ‌ట కిర‌ణ్. ఇక సావిత్రి కుటుంబ స‌భ్యులు కూడా ఆయ‌న‌కి అమ్మితేనే బాగుంటుంద‌ని అనుకున్నార‌ట‌.

సావిత్రిపై కిర‌ణ్‌కుమార్‌కి అమితమైన‌ ప్రేమ ఉందని, అలాగే సావిత్రి   కి బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టం కాబట్టి..  బంగారు ఆభరణాల వ్యాపారం చేసే కిరణ్ కుమార్ కి సావిత్రి ఇల్లు అమ్మితే ఆమె ఆత్మ కూడా శాంతిస్తుంది అనే ఉద్దేశంతోనే ఇల్లు అమ్మార‌ట‌. ఇంత పెద్ద బిజినెస్ మెన్ గా ఎదిగిన కూడా ఇప్ప‌టికీ కిర‌ణ్ కుమార్ సావిత్రి ఇంట్లోనే ఉంటాడ‌ట‌. ఇక సావిత్రిపై ఆయ‌న‌కి ఉన్న ప్రేమ వ‌ల‌న ఆ ఇంటికి సావిత్రి పేరుని అలాగే ఉంచార‌ట‌. ఇల్లు అమ్మినప్పుడు సావిత్రి కూతురు త‌న త‌ల్లి ఫోటోని తీసుకెళ్తుంటే.. మీరు ఏమైనా చేయండి కాని ఆమె ఫోటో మాత్రం తీసుకోవద్దమ్మా అని తాను చెప్పాడ‌ట‌. సావిత్రి ఇంటికి వెళ్ళాకనే కిర‌ణ్ కి అదృష్టం కలిసి వచ్చిందని, వ్యాపారంలో లాభాలు వచ్చాయని  ఆయన చెబుతూ ఉంటారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...