Home Film News Purna: ఫస్ట్ టైం తన కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్.. ఎంత ముద్దుగా ఉన్నాడు..!
Film News

Purna: ఫస్ట్ టైం తన కొడుకుని పరిచయం చేసిన హీరోయిన్.. ఎంత ముద్దుగా ఉన్నాడు..!

Purna: ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అవును సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన పూర్ణ ప్ర‌స్తుతం స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తుంది.అలానే జ‌డ్జిగా కూడా సంద‌డి చేస్తుంది. పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం కాగా, స్క్రీన్ నేమ్ ని పూర్ణ‌గా మార్చుకుంది. సీమ టపాకాయ్, అవును వంటి హిట్ చిత్రాల్లో నటించిన పూర్ణ ఆ జోరు కొన‌సాగించ‌లేక ఇప్పుడు స‌పోర్టింగ్ రోల్స్ పోషిస్తుంది. అయితే కెరీర్‌లో బిజీగా ఉన్న స‌మయంలో పూర్ణ‌.. గోప్యంగా దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని వివాహం చేసుకుంది గ‌త ఏడాది మే 31న షానిద్ తో నిశ్చితార్థం కాగా జూన్ 12న దుబాయ్ లో వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్న‌ట్టు పూర్ణ వెల్లడించారు.

భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ త‌న కెరీర్ కొన‌సాగిస్తూ బిజీగా ఉంది. ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా బుల్లితెరపై సంద‌డి చేస్తున్న పూర్ణ అడ‌పాద‌డ‌పా సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దసరా మూవీలో పూర్ణ చిన్న రోల్ చేయ‌గా, ఈ చిత్రంలో పూర్ణ పాత్ర‌కి మంచి పేరు వ‌చ్చింది. అయితే ఈ ఏడాది పూర్ణ పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా, త‌న కుమారుడిని ప‌రిచయం చేయాల‌ని నెటిజ‌న్స్, అభిమానులు సోష‌ల్ మీడియాలో పూర్ణ‌ని రిక్వెస్ట్ చేశారు. ఎట్ట‌కేల‌కు తాజాగా ఓ వివాహ వేడుక‌కి హాజ‌రైన పూర్ణ సోష‌ల్ మీడియాలో భ‌ర్త‌తో పాటు కుమారుడితో క‌లిసి దిగిన పిక్స్ షేర్ చేసింది.

 

పూర్ణ త‌నయుడు అచ్చం వాళ్ల నాన్న పోలిక‌ల‌తో ఉన్నాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రేమో త‌ల్లి పోలిక అని అంటున్నారు. బుడ్డోడు మాత్రం భ‌లే బాగున్నాడు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పెళ్లి సందర్భంగా పూర్ణ భర్త ఇచ్చిన కానుకల గురించి కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వార్త‌లు వ‌చ్చాయి. భర్త షానిద్ కొన్ని కోట్ల విలువైన గిఫ్ట్‌లు పూర్ణ‌కి ఇచ్చాడ‌ని అన్నారు. అంతేకాదు పెళ్లికి ముందే ఆమెకు 2700 గ్రాముల బంగారాన్ని కూడా గిఫ్టుగా ఇచ్చాడని చెప్పుకొచ్చారు. దీనిపై పూర్ణ ఏ మాత్రం స్పందించ‌లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...