Home Film News Heroine: ఏడు సార్లు ఎన్టీఆర్ సినిమా వ‌చ్చిన కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవ‌రంటే..!
Film News

Heroine: ఏడు సార్లు ఎన్టీఆర్ సినిమా వ‌చ్చిన కూడా రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవ‌రంటే..!

Heroine: ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఒక‌రు.త‌న తాన నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన జూనియ‌ర్ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు ఇటీవల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో తెలుగు సినిమా స్థాయిని పెంచారు. చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ చూపించిన ప‌ర్‌ఫార్మెన్స్ న‌భూతో న‌భ‌విష్య‌త్ అని చెప్పాలి. ట్రిపుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా కొర‌టాల తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

అయితే ఎన్టీఆర్‌తో సినిమా అవ‌కాశం వ‌స్తే హీరోయిన్స్ ఎగిరి గంతేస్తారు. అత‌నితో న‌టించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపుతుంటారు. కాని ఓ హీరోయిన్ మాత్రం ఏడుసార్లు అవ‌కాశం వ‌చ్చిన కూడా రిజెక్ట్ చేసింద‌ట‌. మ‌రి ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అనుష్క‌. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అనుష్క చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసింది. కాని ఎన్టీఆర్‌తో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. అయితే   దాదాపు ఏడుసార్లు అనుష్కకి హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. కానీ అనుష్క మాత్రం అప్పట్లో ఈ ఆఫర్ కి నో చెబుతూనే వ‌చ్చింద‌ట‌.దానికి ప్రధాన కారణం అప్పట్లో ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండ‌డం అని తెలుస్తుంది.

అనుష్క ఎన్టీఆర్ క‌న్నా కాస్త పొడుగ్గా ఉంటుంది కాబ‌ట్టి ఇద్ద‌రు ప‌క్క‌న ప‌క్క‌న ఉంటే సినిమా ప్రియులు అస్స‌లు యాక్సెప్ట్ చేయరు అని భావించిన అనుష్క  ఎన్టీఆర్ సరసన నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసిందట.అయితే ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఎన్టీఆర్ అభిమానులు త‌మదైన శైలిలో స్పందిస్తున్న‌రు. అప్పుడు మా అన్న ప‌క్కన న‌టించే అవకాశం వ‌చ్చిన రిజెక్ట్ చేశావు,   ఇప్పుడు అలాంటి అవకాశం కావాలి అని నువ్వు అనుకున్నా కూడా మా ఎన్టీఆర్ ఇవ్వడు అంటూ స‌ర‌దా కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుష్క న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి చిత్రం వ‌చ్చే నెల‌లో విడుద‌ల కానుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...