Home Film News Mahesh Babu: కొత్త కారు కొన్న మ‌హేష్ బాబు.. ఈ కారు ఉన్న ఏకైక వ్య‌క్తి సూప‌ర్ స్టారేనా?
Film News

Mahesh Babu: కొత్త కారు కొన్న మ‌హేష్ బాబు.. ఈ కారు ఉన్న ఏకైక వ్య‌క్తి సూప‌ర్ స్టారేనా?

Mahesh Babu: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఇచ్చి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ బాబు.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.  మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాల‌నే ఉద్దేశంతో మేక‌ర్స్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుపుతున్నారు. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ బాబు- రాజమౌళి కాంబినేష‌న్‌లో భారీ ప్రాజెక్ట్ రూపొంద‌నుంది. ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా హాలీవుడ్ త‌ర‌హాలో చిత్రీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుతం చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఇక సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాజాగా మ‌హేష్ బాబు ఓ ఖ‌రీదైన కారుని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇలాంటి కారు హైదరాబాద్‌లో ఎవ‌రికి లేద‌ట‌.  సాధార‌ణంగా స్టార్ హీరోలు ఖ‌రీదైన కార్లు కొనుగోలు చేసేందుకు ఆస‌క్తి చూపుతుంటారు.   చిరంజీవి, జూ. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి వారు ల‌గ్జ‌రీ కార్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా స‌రికొత్త డిజైన్ తో కూడిన రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.5.4 కోట్ల అని స‌మాచారం. దీని మోడ‌ల్‌ రేంజ్ రోవర్ ఎస్ వి కాగా, పూర్తిగా గోల్డెన్ కలర్ లో ఉంటుంది. ఇది ఇప్పుడు మ‌హేష్ బాబు గ్యారేజ్‌కి చేరిన‌ట్టు స‌మాచారం.

గోల్డెన్ కలర్ రేంజ్ రోవర్ కారు ని కొనుగోలు చేసిన ఏకైక వ్య‌క్తి మ‌హేష్ బాబు కాగా, ఈ కారులో ఆయ‌న హైద‌రాబాద్‌లో చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్టు తెలుస్తుంది. ఇక మ‌హేష్ ఒక‌వైపు  వెండితెరపై నటిస్తూనే పలు యాడ్స్ లో నటిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. మ‌రోవైపు బిజినెస్‌ల‌లో కూడా రాణిస్తున్నాడు.. బాలీవుడ్ భామ‌ నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకోగా, ఈ జంట‌కి సితార‌, గౌత‌మ్ కృష్ణ అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి మ‌హేష్ త‌ర‌చు విహార యాత్ర‌ల‌కు వెళుతూ ఉంటారు. కొద్ది నెల‌ల క్రితం మ‌హేష్ ఫ్యామిలీలో వ‌రుస విషాదాలు చోటు చేసుకోగా, ఆ స‌మ‌యంలో ఆయన చాలా కుంగిపోయారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...