Home Film News Hyper Adi: మ‌రోసారి వార్త‌ల‌లోకి ఆది పెళ్లి.. యాంక‌ర్‌తో నిశ్చితార్థం జ‌రుపుకోబోతున్నాడా..!
Film News

Hyper Adi: మ‌రోసారి వార్త‌ల‌లోకి ఆది పెళ్లి.. యాంక‌ర్‌తో నిశ్చితార్థం జ‌రుపుకోబోతున్నాడా..!

Hyper Adi: వెండితెర మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా స‌ల్మాన్ ఖాన్, ప్ర‌భాస్, రామ్ వంటి హీరోలు ఉండ‌గా, బుల్లితెర విష‌యానికి వ‌స్తే హైప‌ర్ ఆది, యాంక‌ర్ ప్ర‌దీప్, సుడిగాలి సుధీర్ వంటి వారు ఉన్నారు. వీరి పెళ్ళిళ్ల‌కి సంబంధించి ఎప్పుడు ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంది. ముఖ్యంగా హైప‌ర్ ఆది పెళ్లి గురించి అయితే జోరుగా ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఒక సారి త‌న కుటుంబ స‌భ్యుల‌లో ఒక‌రిని హైప‌ర్ ఆది వివాహం చేసుకోనున్నాడ‌ని, మ‌రోసారి సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లాడ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగింది. ఇక ఇప్పుడు ఓ యాంక‌ర్‌తో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

హైప‌ర్ ఆది పంచ్‌ల‌కి చాలా ఫేమ‌స్ . అత‌ను కామెడీ టైమింగ్‌, వేసే పంచ్‌లు క‌డుపుబ్బ న‌వ్విస్తాయి.  జబర్దస్త్ లో  రైటర్ గా కెరీర్ మొద‌లు పెట్టి ఆ తర్వాత తన పంచులతో బాగా ఫేమస్ అయిన ఆది టీం లీడర్ గా కూడా  మారాడు.  శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్, ఢీ షో వంటి షోల‌తో ఫుల్ పాపుల‌ర్ అయ్యాడు.ఇక సినిమాల‌లో కూడా అడ‌పాద‌డ‌పా క‌నిపిస్తూనే ఉన్నాడు. జ‌న‌సేన పార్టీ స‌భ‌ల‌లో కూడా అప్పుడ‌ప్పుడు మెరుస్తూ ఉంటాడు.  అయితే హైప‌ర్ ఆది వ‌య‌స్సు 30 ఏళ్లకు పైనే ఉన్నట్టు తెలుస్తుండగా, ఆయ‌న  ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.

కాని ఆయన అభిమానులు, నెటిజన్స్ మాత్రం హైప‌ర్ ఆదిని పెళ్లెప్పుడు ప్ర‌శ్నిస్తూనే ఉన్నారు. ఆ స‌మ‌యంలో మ‌నోడు  షో ల కోసం  ఫేక్ పెళ్లిళ్లు చేసుకొని  ఫ్యాన్స్‌ని సంతోష‌పెట్టేవాడు. అయితే ఇప్పుడు ఆది నిజంగానే పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మయ్యాడ‌నే టాక్ వినిపిస్తుంది.  యూట్యూబ్ లో పనిచేసే ఒక యాంకర్ వ‌ల‌న ఆది ఈ స్థాయికి చేరింద‌ని, ఆమె స‌పోర్ట్ వ‌లనే ఆది ఈ రోజు ఇంత గొప్పగా బ‌తుకున్నాడని, అందుకే ఆమెతో పెళ్లిపీట‌లు ఎక్కాల‌ని ఆది భావిస్తున్నాడ‌ని  స‌మాచారం . వీరి పెళ్లికి  ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకున్నారని.. దీంతో త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని వీళ్లిద్దరి నిశ్చితార్ధం కూడా జ‌ర‌గ‌నుంద‌ని టాక్. నిశ్చితార్థం అయిన మూడు నెల‌ల‌కి పెళ్లి కూడా జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. ఈ వార్త‌ల‌పై ఆది ఏమైన స్పందిస్తాడా అన్న‌ది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...