Home Film News Mega Family: పిచ్చి ప‌రాకాష్ట‌కి చేరిందిగా.. మెగా కోడ‌లి క్యాస్ట్ ఏంటంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌
Film News

Mega Family: పిచ్చి ప‌రాకాష్ట‌కి చేరిందిగా.. మెగా కోడ‌లి క్యాస్ట్ ఏంటంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌

Mega Family: అందాల రాక్ష‌సి చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన లావ‌ణ్య త్రిపాఠి ఆ త‌ర్వాత ప‌లు క్రేజీ చిత్రాలు చేసి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించింది. ఈ అమ్మ‌డికి కొన్నాళ్లుగా స‌రైన స‌క్సెస్ లేదు. దీంతో లావ‌ణ్య త్రిపాఠి పేరు ఎక్క‌డా పెద్ద‌గా వినిపించేది కాదు. ఎప్పుడైతే వ‌రుణ్ తేజ్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రుపుకుందో అప్ప‌టి నుండి ఈ అమ్మ‌డు హాట్ టాపిక్ అయింది. అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి ఎక్క‌డి నుండి వ‌చ్చింది,ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఆమె కులం ఏంటి తెలుసుకునేందుకు నెటిజ‌న్స్ ఆస‌క్తి చూపుతున్నారు. లావణ్య సినీ ప‌రిశ్ర‌మలో రొమాంటిక్ డ్రామాలు, కామెడీలు , థ్రిల్లర్‌లతో సహా అనేక రకాల పాత్రల్లో నటించి మెప్పించింది.

ఈ అమ్మ‌డు మంచి సినిమాల్లో నటించడంతో పాటు.. పలు బ్రాండ్లకు ప్రకటనల్లో కూడా నటించింది 2023 నాటికి ఆమె నికర విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇక ఆమెకు ఆస్తులు కూడా చాలానే ఉన్నాయ‌ని టాక్. లావ‌ణ్య తెలుగమ్మాయి అయి ఉంటే ఎప్పుడో ఆమె జాతకమంతా క‌నుక్కునే వాళ్లు. కాని ఈ అమ్మ‌డు నార్త్ బ్యూటీ కావ‌డంతో స‌మాచారం కోసం గూగుల్‌లో వెత‌క‌డం మొద‌లు పెట్టారు. కాపు కులానికి చెందిన వరుణ్ తేజ్ ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోనున్న నేప‌థ్యంలో ఇప్పుడామె కులంపై అందరికీ ఆసక్తి నెలకొంది. దీంతో వేల కొద్దీ అభిమానులు లావణ్యది ఏ కులం అని గూగుల్ తల్లిని ప్ర‌శ్న‌స్తున్నారు.

ఈ క్ర‌మంలో లావణ్య త్రిపాఠి పేరు ఇప్పుడు గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ లో ఉండటం విశేషం. మ‌రి ఇంతకీ ఆమె కులమేంటో మీకు తెలుసా? లావణ్య యూపీకి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగింది. యూపీలోని ఫైజాబాద్ లో ఆమె జన్మించింది. అయితే బ్రాహ్మణురాలే అయినా కూడా కులాల పట్టింపు ఆమెకు ఏ మాత్రం లేదు. ఏ వ్యక్తి అయినా తాను చేసే పనుల వల్ల గొప్పవాళ్లు అవుతారు త‌ప్ప‌ కులం వల్ల కాదు అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. లావణ్య తండ్రి హైకోర్టు లాయర్ కాగా.. ఆమె తల్లి ఓ స్కూల్ టీచర్. లావణ్యకు ఓ తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్‌తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించ‌గా, ఆ సమ‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ని స‌మాచారం.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...