Home Film News Anasuya: డబ్బిచ్చి విజయ్ దేవరకొండ.. అనసూయని ట్రోల్ చేయించాడా..!
Film News

Anasuya: డబ్బిచ్చి విజయ్ దేవరకొండ.. అనసూయని ట్రోల్ చేయించాడా..!

Anasuya: యాంకర్‌గా, న‌టిగా స‌త్తా చాటుతున్న అన‌సూయ కొంత కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తుంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషీ’ పోస్టర్ పై ‘ది విజయ్ దేవరకొండ’ అని ఉండటాన్ని ఆక్షేపించిన అన‌సూయ ఇన్‌డైరెక్ట్‌గా అత‌నిపై మండిప‌డింది.  దీంతో విజయ్ ఫ్యాన్స్.. అనసూయ పై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేశారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ  ఏం చేయ‌క‌పోయిన కూడా ఎందుకు ఆమె ఇంత‌లా చేస్తుంద‌ని చాలా మంది ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే అన‌సూయ‌.. విజ‌య్‌పై అంత‌లా ట్రోల్ చేయ‌డం గురించి తాజాగా ఓ ఇంట‌ర్యూలో తెలియ‌జేసింది.

అన‌సూయ న‌టించిన తాజా చిత్రం విమానం. ఈ చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.  అయితే విమానం మూవీ ప్రమోషన్ లో భాగంగా అన‌సూయ  ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తలెత్తిన విభేదాలపై మాట్లాడింది. తనకు కొంత‌ మానసిక ప్రశాంతత కావాలని, అందుకే ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దామని అనుకుంటున్నాన‌ని తెలియ‌జేసింది. విజయ్ దేవరకొండ అభిమానులతో వార్ జ‌రుగుతున్న‌ప్ప‌టి నుండి మాన‌సిక ప్ర‌శాంత‌త కోల్పోయిన‌ట్టు తాను పేర్కొంది. అయితే ఈ విషయాలన్నీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి తెలుసో లేదో నాకు తెలియ‌దు కాని విజయ్ దేవరకొండకి క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి డ‌బ్బులు ఇచ్చి ఇలా త‌న‌పై సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేయించాడ‌ని తెలిసింది.

ఈ వివాదంకి సంబంధించి తాను అలసిపోయానని.. ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు  అన‌సూయ  పేర్కొంది. విజయ్ గురించి గానీ, విజయ్ కి సంబంధించిన వారి గురించి గానీ ఇకపై  మాట్లాడనని అన‌సూయ స్ప‌ష్టం చేసింది.  విజయ్ దేవరకొండ తనకు ఎంతో కాలం నుంచి తెలుసునని, అయితే ఒక‌ప్పుడు ఇద్ద‌రం మంచి స్నేహితుల‌మ‌ని పేర్కొంది.  ఇక అన‌సూయ కొద్ది రోజులుగా విదేశాల‌కి ట్రిప్‌గా వెళ్లింది. అక్క‌డ బికినీలో ఈ అమ్మ‌డు చేసిన ర‌చ్చ సోష‌ల్ మీడియాని షేక్ చేసింది. చాలా మంది అన‌సూయ తీరుని త‌ప్పు ప‌ట్టారు. దారుణంగా ట్రోల్ చేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...