Home Film News Allu Arjun Plan: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. ఆదిపురుష్‌తో ట్రిపుల్ ఏ లాంచ్‌..!
Film News

Allu Arjun Plan: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. ఆదిపురుష్‌తో ట్రిపుల్ ఏ లాంచ్‌..!

Allu Arjun Plan: ఇటీవ‌ల కాలంలో చాలా మంది స్టార్స్ సినిమాలు చేస్తూనే మ‌రోవైపు బిజినెస్ రంగంలో కూడా రాణిస్తున్నారు. మ‌హేష్ బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి వారు ఏషియ‌న్ సంస్థ‌తో క‌లిసి థియేట‌ర్ బిజినెస్ చేస్తున్నారు. ఇక వీరి బాట‌లోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప‌య‌నిస్తున్నాడు.  ఆయ‌న ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ తో చేతులు కలిపి ఓ భారీ మల్టిఫ్లెక్స్ ని నిర్మిస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ కొత్త థియేటర్‌లో ఎన్నో హంగులతో పాటు మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఏఏఏ సినిమాస్‌గా పిలవబడుతున్న ఈ  థియేటర్‌లో పూర్తిస్థాయి ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన‌ట్టు స‌మాచారం.

దక్షిణ భారతంలో అద్భుత‌ ఫీచర్లున్న థియేటర్ గా ఏఏఏ సినిమాస్ నిలుస్తుంద‌ని అంటున్నారు.. హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ ప్రొజెక్షన్ స్క్రీన్‌ ఉన్న ఏకైక థియేటర్ గా ఇది రికార్డుల‌కెక్కింది. ఈ  థియేటర్‌లో అడుగుపెట్టే వారికి కచ్చితంగా స‌రికొత్త అనుభూతి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే  ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ తో ఏఏఏ సినిమాస్ ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. ఆదిపురుష్ చిత్రం భారీ పాన్ ఇండియా చిత్రం మాత్రమే కాక రామాయణం గాథతో కూడా తెర‌కెక్కిన నేప‌థ్యంలో  ప్రారంభోత్సవానికి ఆ సెంటిమెంట్  కూడా వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని యాజ‌మాన్యం అనుకుంటుంద‌ట‌.

జూన్ 15న ఏఏఏ సినిమాస్ అల్లు అర్జున్ చేతుల మీదుగా గ్రాండ్ గా లాంచ్ కానుండ‌గా,  ఆ మరుసటి రోజు అంటే 16 నుంచి ఈ మల్టిఫ్లెక్స్ లోఆదిపురుష్ తో  తొలి చిత్ర ప్రదర్శన  మొదలవుతుంది. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ లో సినిమా ప్రదర్శనలు మాత్రమే కాకుండా చిన్నపాటి సినిమా ఈవెంట్స్ కూడా జరగడం మ‌నం చూస్తున్నాం.  భ‌విష్యత్తులో అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ లో కూడ ఇలాంటి  సందడి  త‌ప్ప‌క ఉండ‌నుంది. మ‌రి ఆదిపురుష్‌తో ప్రారంభం అవుతున్న ఏఏఏ సినిమాస్ రానున్న రోజుల‌లో ఎలాంటి సినిమాలు విడుద‌ల చేస్తుందో చూడాలి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...