Home Film News Suma: యాంక‌ర్ సుమ కాలికి గాయాలు.. షాక్‌లో అభిమానులు
Film News

Suma: యాంక‌ర్ సుమ కాలికి గాయాలు.. షాక్‌లో అభిమానులు

Suma: స్టార్ హీరోయిన్స్‌ని మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంక‌ర్ సుమ‌. ఎంత మంది కొత్త యాంక‌ర్స్ వ‌చ్చిన‌,అందాలు ఎంత ఆర‌బోసిన కూడా సుమ స్థానాన్ని ఎవ‌రు భర్తీ చేయ‌లేక‌పోతున్నారు. పుట్టింది కేరళలో అయినా తెలుగులో మాత్రం గల గల మాట్లాడుతూ ఎంతో మంది మ‌న‌సులు గెలుచుకుంది. టీవీ షో అయినా, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ అయినా అవలీల‌గా డీల్ చేయ‌డం సుమ సొంతం. కొన్నేళ్లుగా త‌న మాట‌ల‌తో కోట్లాది అభిమానులని సొంతం చేసుకున్న సుమ‌కి సంబంధించిన వార్త అభిమానుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తుంది.

ఇటీవ‌ల తిరుపతి వేదిక‌గా ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇంత పెద్ద భారీ ఈవెంట‌లో సుమ క‌నిపించ‌క‌పోవ‌డం అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. సుమకి బదులుగా మ‌రో సీనియర్ యాంకర్ ఝాన్సీ రంగంలోకి దిగడంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. దాదాపు ఇలాంటి పెద్ద ఈవెంట్స్‌కి సుమ‌నే హోస్ట్‌గా ఉంటుంది క‌దా, అలాంటిది ప్ర‌దీప్, ఝాన్సీలు ఎందుకొచ్చారా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచించ‌డం మొద‌లు పెట్టారు.అంతేకాదు యాంకర్ సుమ ఇన్ స్టాగ్రామ్‌లో కూడా.. మీరు లేని లోటు ఈవెంట్‌లో స్ప‌ష్టంగా కనిపించిందంటూ మెసేజ్‌లు కూడా చేశారు.

 

దీంతో యాంకర్ సుమ కూడా.. ఆది పురుష్ ఈవెంట్ మిస్ అయినందుకు బాధ‌ప‌డుతున్నానంటూ ఓ వీడియో షేర్ చేసింది. అంతే కాక ప్రస్తుతం ఫారిన్‌ వెకేషన్‌లో ఉన్న తాను బాగా తిరగడం వల్ల తన కాలివేళ్లకు గాయాలు అయ్యాయని పేర్కొంది. షూస్‌ కొరికేయడంతో గాయాలు తీవ్రమై చాలా బాధ కలిగిస్తున్నాయని అందుకే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది సుమ. దీంతో అంద‌రిలో ఉన్న అనుమానాల‌కి పులిస్టాప్ ప‌డింది. ప్ర‌స్తుతం సుమ‌ తన ఫ్యామిలీతో కలిసి ప్యారిస్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలను చుట్టేస్తూ స‌మ్మ‌ర్‌ని ఇలా గ‌డిపేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ట్రిప్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తుంది.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...