Home Film News Sita Ramam Teaser : లెఫ్టినెంట్ రామ్ – సీతా మహాలక్ష్మీల ప్రేమాయణం.. ‘సీతా రామం’
Film News

Sita Ramam Teaser : లెఫ్టినెంట్ రామ్ – సీతా మహాలక్ష్మీల ప్రేమాయణం.. ‘సీతా రామం’

Sita Ramam Teaser
Sita Ramam Teaser

Sita Ramam Teaser: మలయాళ స్టార్.. తెలుగు, తమిళ్, హిందీలోనూ నటించి వెర్సటైల్ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకున్న దుల్కర్ సల్మాన్.. ‘మహానటి’ తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నారు. ‘అందాల రాక్షసి, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘పడిపడిలేచే మనసు’ వంటి విభిన్నమైన ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకున్న హను రాఘపూడి డైరెక్ట్ చేస్తున్నారు.

వైజయంతి మూవీస్ సమర్పణలో, స్వప్న సినిమా బ్యానర్ మీద అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ప్రేమకీ యుద్ధానికీ ముడిపెడుతూ అపురూప దృశ్యకావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘సీతా రామం’ అనే అందమైన, ఆకట్టుకునే పేరు పెట్టినప్పటినుండే ఇదో ఫీల్ గుడ్ ఫిలిం అనే సంకేతాలు వచ్చాయి.

శనివారం ‘సీతా రామం’ టీజర్ రిలీజ్ చేశారు. ఆద్యంతం అలరిస్తూ, అంచనాలు పెంచేసిందీ టీజర్.. 1965లో కథ జరుగుతున్నట్లు ప్రారంభంలో చూపించారు. దుల్కర్, మృణాల్ పెయిర్ చాలా చక్కగా ఉంది. క్లుప్తంగా హీరో హీరోయిన్ల మధ్య సంబంధం ఏంటనేది చూపించారు. డైలాగ్స్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరాయి. ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ‘సీతా రామం’ ప్రేక్షకుల మందుకు రానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...