Home Film News Oka Padhakam Prakaram : ‘ఓసారిలా రా’.. యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్న బ్యూటిఫుల్ మెలోడీ..
Film News

Oka Padhakam Prakaram : ‘ఓసారిలా రా’.. యూత్ లూప్ మోడ్‌లో పెట్టేసుకుంటున్న బ్యూటిఫుల్ మెలోడీ..

Osaarilaa Raa Lyrical Song
Osaarilaa Raa Lyrical Song

Oka Padhakam Prakaram: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ ‘143’, ‘డేంజర్’, ‘బంపర్ ఆఫర్’, ‘వెయ్యి అబద్ధాలు’ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సాలిడ్ కమ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సాయి నటించిన ‘ఒక పథకం ప్రకారం’ లోని ఓ బ్యూటిఫుల్ మెలోడి కొద్దిరోజులుగా నెట్టింట వైరల్ అవుతుంది.

సాయి రామ్ శంకర్, ఆషిమా నర్వాల్ మెయిన్ లీడ్స్‌గా.. పాపులర్ మలయాళీ డైరెక్టర్ వినోద్ విజయన్ దర్శకత్వంలో.. వినోద్ విజయన్ ఫిల్మ్స్, విహారీ సినిమా హౌస్ (PVT LTD) బ్యానర్ల మీద వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘ఒక పథకం ప్రకారం’..

ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌తో పాటు.. సినిమా కచ్చితంగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఈ మూవీలోని ‘ఓసారిలా రా’ అనే సోల్ ఫుల్ మెలోడీని ఇటీవల ‘ఉస్తాద్’ రామ్ పోతినేని రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఎక్కడవిన్నా ఈ పాటే వినిపిస్తుంది.

సినిమాకి సగం ప్రాణం సంగీతం.. ఆడియో క్లిక్ అయితే సినిమా హిట్టే అనేవాళ్లు అప్పట్లో.. కానీ ఇప్పుడు ఒక్క సాంగ్ చార్ట్ బస్టర్ అయినా ఆడియన్స్ థియేటర్లకొచ్చేస్తున్నారు. అలా రాహుల్ రాజ్ ట్యూన్, రెహ్మాన్ లిరిక్స్, యంగ్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ వాయిస్ ఈ ‘ఓసారిలా రా’ పాటకు ప్రాణం పోసేశాయి.

ఒక్కసారి ఈ సాంగ్ వింటే చాలు.. మైండ్‌లో నుండి, మనసులో నుండి అంత త్వరగా పోదు.. యూత్ లూప్ మోడ్‌లోనూ, రింగ్ టోన్స్ గానూ పెట్టేసుకుంటున్నారు. శృతి సోది (పటాస్ ఫేం), సముద్రఖని తదితరులు కీలకపాత్రల్లో నటించిన ‘ఒక పథకం ప్రకారం’ జూలైలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...