Home BoxOffice ‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..
BoxOffice

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

3 Years For Goodachari

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా నటించాడు. శోభిత దూలిపాళ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిషోర్, అనిష్ ప్రధాన మరియు సహాయ పాత్రల్లో నటించిన సినిమా ఇది. అద్బుతమైన థ్రిల్లర్ కథతో వచ్చిన ఈ మూవీ రిలీజ్ అవగానే మంచి మౌత్ పబ్లిసిటీ తెచ్చుకుంది. జెన్యూన్ గా కథ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.. ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించాడు అడివి శేష్.

2018 ఆగస్ట్ 3 న విడుదలైన ఈ మూవీ నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న గూఢచారిని డైరెక్ట్ చేసిన శశి కిరణ్ తిక్కకి ఇది డెబ్యూ ఫిల్మ్ అవడం విశేషం. కేవలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ఈ జానర్ ని తెలుగు వాళ్ళకి పరిచయం చేసిన ఈ మూవీ టీం కి థాంక్స్ చెప్పుకోవాలి. సినిమాని ఇలా కూడా చేసి సక్సెస్ చూడొచ్చని నిరూపించారు. నేషనల్ మీడియా నుంచి కూడా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలోకి Intelligent Khiladi పేరుతో డబ్ అయింది కూడా.

దాదాపు 6 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల దాకా రాబట్టి పెద్ద హిట్ గా నిలిచింది. ఫలితంగా.. గూఢచారి 2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మూవీ టీం. ఇకపోతే సినిమాకి సీక్వెల్ తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. కానీ రెండో భాగాన్ని శశి కిరణ్ తిక్క కాకుండా, స్క్రీన్ ప్లే రాసుకున్న వాళ్ళలో మరొకరైన రాహుల్ పాకాల ఈ సెకండ్ పార్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....

12 ఏళ్ల మగధీర, ఎంత కలెక్ట్ చేశాడంటే..

రాజమౌళి దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ హిట్స్ లో మగధీర ఒకటి. 30 జులై 2009 న...