Home Film News Labour License: బ్రో సినిమాలో ప‌వ‌న్ చేతికి ఉన్న‌లేబ‌ర్ లైసెన్స్ బిళ్ల గ‌మ‌నించారా..దీని వెన‌క క‌థ చాలా ఉందే..!
Film News

Labour License: బ్రో సినిమాలో ప‌వ‌న్ చేతికి ఉన్న‌లేబ‌ర్ లైసెన్స్ బిళ్ల గ‌మ‌నించారా..దీని వెన‌క క‌థ చాలా ఉందే..!

Labour License: దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుండి వ‌చ్చి చిత్రం బ్రో. త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేశారు. ఈ చిత్రంకి తొలి షో నుండి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీసులో పటాకులు కాల్చి సంబరాలు జ‌రుపుకున్నారు. ప‌వ‌ర్ స్టార్ వన్ కళ్యాణ్ తొలిసారి తన ఫ్యామిలీ హీరోతో పూర్తి స్థాయి మల్టీస్టారర్ చేయ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో మూవీని   చూడటానికి అభిమానులు థియేటర్స్‌కు పోటెత్తారు.ఇక ఈ చిత్రంలో  పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్, గెటప్స్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

బ్రో సినిమాలో భ‌గ‌వంతుడిగా క‌నిపించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెరైటీ గెట‌ప్స్ లో క‌నిపించి సంద‌డి చేశారు. ముఖ్యంగా ఆయ‌న కూలీ గెట‌ప్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.  ఎర్ర చొక్కా, లుంగీ కట్టు క‌ట్టుకొని బీడీ కాల్చుతూ ఊర మాస్ అవతార్ లో పవన్ మెస్మరైజ్ చేశార‌నే చెప్పాలి. త‌మ్ముడు సినిమాలో కూడా ప‌వన్ ఇలానే కనిపించి ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించాడు. అయితే కూలీ గెటప్ లో ఉన్న‌ పవన్ చేతికి లేబర్ లైసెన్సు బిళ్ళ మన‌కి క‌నిపిస్తుంది. దీనిలో జనసేన పార్టీ జెండాలోని ఒక స్టార్ మ‌నం చూడ‌వ‌చ్చు.దీనిని ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన‌ట్టు స‌మాచారం.   ఏపీలో గల తెనాలి పట్టణంలోఇది త‌యారైన‌ట్టు చెబుతున్నారు.

గోల్డ్ వర్కర్స్ సోమరౌతు బ్రహ్మం, అనురాధ ల‌కి తెనాలిలో సిల్వర్ అండ్ గోల్డ్ షాప్ ఉంది. వారు ఆ లైసెన్స్ బిళ్ల‌లో జనసేన గుర్తు వచ్చేలా డిజైన్ చేశారు..ఇప్పుడు ఇది అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఈ విష‌యం తెలుసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు ఆ బిళ్ల‌ని ప్ర‌త్యేకంగా గ‌మ‌నిస్తున్నారు. ఏదేమైన బ్రో సినిమా  కోసం సోమ‌రౌతు బ్ర‌హ్మం, అనురాధ‌లు లైసెన్స్ బిళ్ల త‌యారు చేయ‌డంతో వారికి ఇప్పుడు ఫుల్ పాపులారిటీ ద‌క్కింది. కాగా,  భీమ్లా నాయక్ సినిమాతో మొగిలయ్య అనే జానపద కళాకారుడికి కూడా మంచి పేరు ద‌క్కింది. ఈ సినిమా తర్వాతే ఆయ‌న‌కి ప‌ద్మ‌శ్రీ అవార్డ్ ద‌క్కింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...