Home Film News BRO Collections: బ్రో క‌లెక్ష‌న్ల సునామి.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టిందో తెలుసా?
Film News

BRO Collections: బ్రో క‌లెక్ష‌న్ల సునామి.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టిందో తెలుసా?

BRO Collections: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సముద్ర‌ఖని రూపొందించిన చిత్రం బ్రో జూలై 28న విడుద‌లైంది. ఇద్ద‌రు మెగా హీరోలు క‌లిసి న‌టించిన ఈ సినిమాకి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చాలా రోజుల త‌ర్వాత  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వ‌ల‌న  థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప‌లు చోట్ల వర్షం పడుతున్నప్పటికీ  థియేట‌ర్స్  దగ్గర జన ప్రభంజనం కనిపించింది. ప్రీమియర్ షోస్ నుండే పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ చిత్రం  ఏపీ, తెలంగాణలోనే కాకుండా ఓవ‌ర్సీస్ లో కూడా మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. చిత్రంలో ప‌వ‌న్  స్టైల్, స్వాగ్, వింటేజ్ లుక్స్ తో పాటు ఆయ‌న సినిమాల‌లోని ఓల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ అన్ని కూడా బ్రోలో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ద‌క్కుతుంది.

బ్రో చిత్రం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ మానియా కనిపించింది. టిక్కెట్ రేట్స్ పెంచ‌కుండా  మామూలు ధరలతోనే భారీ వసూళ్లు సాధించడం పవన్‌కే సాధ్యం అని మరోసారి బ్రో చిత్రం నిరూపించింది. బ్రొ చిత్రం అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలుస్తుండ‌గా, ఈ మూవీ  బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 98.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు ఈ చిత్రానికి  రూ. 30.01 కోట్లు  క‌లెక్ష‌న్స్ రాగా,  మరో రూ. 68.49 కోట్లు రాబడితేనే ఈ మూవీ క్లీన్  హిట్ అందుకుంటుంది.

బ్రో చిత్రం కలెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే.. ఆంధ్రా, తెలంగాణలో తొలి రోజు డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది . ఈ మూవీ నైజాంలో రూ. 8.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.70 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.60 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.45 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2.98 కోట్లు, గుంటూరులో రూ. 2.51 కోట్లు, కృష్ణాలో రూ. 1.21 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి.. రూ. 23.61 కోట్లు షేర్, రూ. 35.50 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో చూస్తే రూ. 2.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.30 కోట్లు వసూలు చేసింది.మొత్తం కలిపితే తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 30.01 కోట్లు షేర్‌, రూ. 48.50 కోట్లు గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...