Home Film News Sumanth-Keerthi Reddy: ఎంతో అన్యోన్యంగా ఉండే సుమంత్‌-కీర్తి రెడ్డిలు ఆమె వ‌ల్ల‌నే విడిపోయారా..!
Film News

Sumanth-Keerthi Reddy: ఎంతో అన్యోన్యంగా ఉండే సుమంత్‌-కీర్తి రెడ్డిలు ఆమె వ‌ల్ల‌నే విడిపోయారా..!

Sumanth-Keerthi Reddy: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సుమంత్- కీర్తి రెడ్డి జంట‌. వీరిద్ద‌రిని చూసి వారి అభిమానులు కూడా ఎంత‌గానో మురిసిపోయారు. సుమంత్ ఇండస్ట్రీకి వచ్చిన కొన్నాళ్ల‌కే హీరోయిన్ కీర్తి రెడ్డితో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇక ఆ ప్రేమ‌, పెళ్లిగా మారింది. ఇరువురు త‌మ కుటుంబ స‌భ్యుల‌ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్ద‌రు చ‌క్క‌గా సంసారం చేస్తార‌ని అనుకుంటే ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా చాలా గొడవలు జరగడం తో కలిసి ఉండటం కంటే విడిపోవడమే బెటర్ అని పెళ్లయిన కొన్ని రోజులకే డైవ‌ర్స్ తీసుకొని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. సుమంత్ నుండి విడిపోయిన త‌ర్వాత కీర్తి రెడ్డి మరో అబ్బాయిని వివాహం చేసుకొని సంతోషంగా ఉంటే, ఈ హీరో మాత్రం మ‌ళ్లీ పెళ్లి జోలికి వెళ్లకుండా సోలోగా ఉంటున్నాడు.

అయితే సుశాంత్‌- కీర్తి రెడ్డి విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌దు. అంద‌రి మ‌ధ్య జ‌రిగిన‌ట్టే వీరి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగి ఉంటాయ‌ని, అవి చిలికి చిలికి గాలి వాన‌లా మార‌డంతో వారిద్ద‌రు విడాకుల నిర్ణ‌యం తీసుకొని ఉంటార‌ని ప‌లువురు భావించారు. ఇంకొంద‌రు అయితే అప్ప‌ట్లో ఒక క‌థనం వినిపించారు. సుమంత్‌కు సంబంధించిన అన్ని వ్య‌వ‌హారాల్లోనూ ఆయ‌న అక్క సుప్రియ‌ జోక్య‌మే ఎక్కువ‌గా ఉండేద‌ని, సుమంత్ సినిమాల ద‌గ్గ‌ర నుంచి వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ర‌కు సుప్రియ‌నే చూసుకునేద‌ని, సుమంత్ కూడా త‌న అక్క చెప్పిన‌ట్టే న‌డుచుకునేవాడ‌ని, అది కీర్తికి నచ్చ‌క‌పోవ‌డంతో విడాకులు తీసుకుంద‌ని చెప్పుకొచ్చారు

 

అక్కినేని ఫ్యామిలీ నుండి వ‌చ్చిన సుశాంత్ కెరీర్ కూడా స‌జావుగా సాగ‌లేదు. కెరీర్ మొద‌ట్లో మంచి హిట్స్ అందుకున్న సుమంత్ త‌ర్వాత త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు ద‌క్కించుకున్నాడు. ప్రేమ కథ అనే సినిమాతో తెలుగు చిత్ర సినిమాకి పరిచయమైన సుమంత్‌కి స‌క్సెస్‌లు పెద్ద‌గా రాక‌పోయిన కూడా ఆఫ‌ర్స్ మాత్రం భారీగానే వ‌చ్చాయి. అయితే కొన్నాళ్లు సినిమా ప‌రిశ్ర‌మ‌కి దూరంగా ఉన్న సుమంత్ ఈ మ‌ధ్య ఓ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. అది కూడా బెడిసికొట్ట‌డంతో ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉన్నాడు.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...