Home Film News Nagarjuna: నాగార్జున కీల‌క నిర్ణయం.. కొడుకుల కోసం కొత్త వ్య‌క్తిని తీసుకొస్తున్నాడంటూ ప్ర‌చారం
Film News

Nagarjuna: నాగార్జున కీల‌క నిర్ణయం.. కొడుకుల కోసం కొత్త వ్య‌క్తిని తీసుకొస్తున్నాడంటూ ప్ర‌చారం

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగ చైత‌న్య‌, అఖిల్ ప‌ర్స‌న‌ల్ లైఫ్, ప్రొఫెష‌న‌ల్ లైఫ్ ఇప్పుడు ఏమంత బాగోలేదు. అఖిల్ శ్రేయా భూపాల్ అనే యువ‌తితో నిశ్చితార్థం చేసుకోగా ,ఆ బంధం పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే ఆగిపోయింది. ఇక సినిమా ప‌రంగా దూసుకుపోతున్నాడా అంటే అది కూడా లేదు. అఖిల్ కెరీర్‌లో ఒక్క పెద్ద హిట్ కూడా లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం మాత్ర‌మే కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఇటీవ‌ల భారీ అంచ‌నాల‌తో ఏజెంట్ అనే చిత్రం రాగా, ఇది పెద్ద డిజాస్ట‌ర్‌గా మారింది. ఇక అఖిల్ ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమాల‌పై మాత్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెడుతున్నాడు.

ఇక నాగ చైత‌న్య విష‌యానికి వ‌స్తే.. ఇత‌ను కూడా తండ్రి, తాత దక్కించుకున్న స్టార్ హోదాని నిల‌బెట్ట‌లేక‌పోతున్నారు. చైతూ.. వరుసగా సినిమాలలో అవకాశాలు అందుకున్నప్పటికీ అవి విజ‌యం సాధించ‌లేక‌పోతున్నాయి. స‌మంత నుండి విడిపోయిన త‌ర్వాత నాగ చైతన్య కెరీర్‌లో ఒక్క మంచి హిట్ ప‌డ‌లేదు. రీసెంట్‌గా క‌స్ట‌డీ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఇది బాక్సాఫీస్ ద‌గ్గర డిజాస్ట‌ర్‌గా మారింది. ఇక నాగార్జున‌కి సైతం ఇటీవ‌లి కాలంలో ఒక్క మంచి హిట్ లేదు. ఈ నేప‌థ్యంలో కింగ్ ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. త‌మ జీవితంలోకి కొత్త వ్యక్తిని తీసుకురావడానికి నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

 

కొడుకుల భవిష్యత్తును చక్కదిద్ది వారిని మంచి దారిలో నడిపించడం కోసం పర్సనల్ అసిస్టెంట్ ను అపాయింట్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సినిమాల విష‌యంలో వారు ఎంచుకునే కథలలో పొరపాటు చేస్తున్నారని ఇప్పటికి చాలామంది ప్రేక్షకులు కామెంట్ చేయడంతో నాగార్జున సపరేట్ టాలెంటెడ్ మేనేజర్ ని అపాయింట్ చేయ‌బోతున్న‌ట్టు టాక్. ఇప్పటికే నాగచైతన్య తన నటనలో మరింత టాలెంట్ ను పెంచుకోవడం కోసం ఆదిశక్తి థియేటర్లో జాయిన్ అయ్యాడని , అందుకు కార‌ణం కూడా కొత్త‌గా జాయిన్ అయిన మేనేజర్ అని అంటున్నారు. అఖిల్ కూడా తన అన్నలాగానే అక్కడికి వెళ్లి జాయిన్ అయి తన నటనపై ప‌ట్టు మ‌రింత పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఇద్ద‌రు హీరోలు ఎలాంటి హిట్స్ కొడ‌తార‌నేది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...