Home BoxOffice 12 ఏళ్ల మగధీర, ఎంత కలెక్ట్ చేశాడంటే..
BoxOffice

12 ఏళ్ల మగధీర, ఎంత కలెక్ట్ చేశాడంటే..

రాజమౌళి దర్శకత్వం వహించిన బిగ్గెస్ట్ హిట్స్ లో మగధీర ఒకటి. 30 జులై 2009 న విడుదలైన ఈ మూవీ ఎన్నో రికార్డ్ లని బద్ధలు కొట్టింది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ప్రేమ కథ కావడం తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అంతకుముందు కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన రామ్ చరణ్ కి రెండో సినిమాతోనే చాలా స్టార్ డం వచ్చేసింది. ఈ మూవీ తర్వాత పెద్ద స్టార్ గా మారిపోయాడు. మొదటి సినిమాతోనే లాంఛనంగా తెచ్చుకున్న ‘మెగా పవర్ స్టార్’ బిరుదుని సార్థకం చేసుకున్నాడు.

హీరో ఒక్కడే కాకుండా హీరోయిన్ గా కనిపించిన కాజల్ అగర్వాల్ కూడా ఎంతో మంది యువత హృదయాల్ని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తన అదృష్టం కూడా మారిపోయింది. ఈ మూవీ తర్వాత అందరు పెద్ద హీరోలతో నటించిన కాజల్ టాప్ హీరోయిన్ గా మారిపోయింది. విలన్ గా కనిపించిన దేవ్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక శ్రీహరి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో మరింతమంది అభిమానులని సంపాదించుకున్నారు.

ఇకపోతే స్వయంగా అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ 35 కోట్లు. కానీ, బాక్సాఫీస్ వద్ద భారీగా లాభాలు పట్టేసింది. ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ మూవీ బెంగాలీ లో యోధ పేరుతో రీమేక్ అవడం, తమిళ, కన్నడ, మలయాళ భాషలలోకి డబ్ అవడం కూడా విశేషం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....

22 ఏళ్ల ‘రాజకుమారుడు’, హీరోగా మహేష్ మొదటి సినిమా @ బాక్సాఫీస్

1999 జూలై 30 న విడుదలైన రాజకుమారుడు సినిమా హీరోగా మహేష్ బాబుకి మొదటి సినిమా....