Home Special Looks ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న సెలబ్రిటీ జంటలు..
Special Looks

ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న సెలబ్రిటీ జంటలు..

Celebrity Pairs With Huge Age Gap Between Them

ప్రేమకు నిజానికి వయసు అడ్డు కాదు. కానీ కొన్ని జంటల మధ్య గ్యాప్ చూస్తే షాకింగ్ గా అనిపిస్తుంది. వాళ్ళు తమ మనసులు మాత్రమే చూసుకుని చేసుకున్నప్పటికీ.. చాలామందికి ఈ ఏజ్ గ్యాప్ లు కాస్త ఇబ్బందిగానే అనిపిస్తాయి. మన కల్చర్ లో అలాంటి పెళ్ళిళ్ళు చాలా అరుదు కావడం కూడా కారణం కావచ్చు. సహజంగా అందరూ తమ వయసుకి కాస్త అటూ ఇటూగా ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఐతే, సెలబ్రిటీలకు అప్పటికే ఉన్న పలుకుబడి, డబ్బు వాళ్ళని కొన్ని నిర్ణయాలు చాలా స్వేచ్ఛగా తీసుకునేలా చేస్తాయేమో..! ఏదేమైనా.. అలాంటి కొన్ని జంటల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ముందుగా నిక్ జోనాస్, ప్రియాంక చోప్రాల గురించే మాట్లాడుకోవాలి. వీళ్లిద్దరికీ చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. పెళ్లి చేసుకునే టైమ్ కి నిక్ కి 24 ఏళ్లు ఉంటే ప్రియాంకకి 34 ఉన్నాయి. వాళ్లిద్దరికీ ఏకంగా పదేళ్ళు గ్యాప్ ఉండటం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. వాళ్ళ కన్నా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉన్న మరో జంట సాయేషా, ఆర్య. ఈ ఇద్దరికీ 17 ఏళ్లు గ్యాప్ ఉంది. సాయేషా కి ఇప్పుడు 23. ఆర్యకి 40.

షాహిద్ కపూర్ & మీరా రాజ్ పుత్ ల మధ్య కూడా చాలా ఏజ్ గ్యాప్ ఉంది. వీళ్లిద్దరికీ 13 ఏళ్ల గ్యాప్ ఉంది. షాహిద్ కి 40. మీరాకి 26. రితేష్ దేశ్ ముక్, జెనీలియాల మధ్య 9 ఏళ్లు గ్యాప్ ఉంది. జెనీ కన్నా రీతూ 9 ఏళ్లు పెద్దవాడు. ఊర్మిళ, మోషిన్ అక్తర్ ల మధ్య 10 ఏళ్లు గ్యాప్. ఊర్మిళ అతనికన్నా పెద్దది. అలాగే కరీనా కపూర్ కన్నా సైఫ్ అలీ ఖాన్ 10 ఏళ్లు పెద్దవాడు. 2007 లో డేటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఐదేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు.

అలాగే ధోనీతో చాలాకాలం రిలేషన్ లో ఉందన్న పుకార్ల తర్వాత అసిన్ వాటన్నిటికీ బ్రేక్ చెప్తూ మైక్రోమాక్స్ బాస్ రాహుల్ శర్మని మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళిద్దరి మధ్య 7 ఏళ్లు గ్యాప్ ఉంది. రాహుల్ అసిన్ కన్నా పెద్దవాడు. అర్జున్ కపూర్, మలైకా ఆరోరాల మధ్య 12 ఏళ్ల గ్యాప్ ఉంది. మలైకా అర్జున్ కన్నా పెద్దది. శ్రీదేవి కనా బోనీ కపూర్ 8 ఏళ్లు పెద్దవాడు. ఫరా ఖాన్ శిరీష్ కన్నా 8 ఏళ్లు పెద్దది. ఫహాద్ ఫాజిల్ కన్నా నజ్రియా 13 ఏళ్లు చిన్నది.

వీళ్లందరికన్నా ఎక్కువ ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకుని, చివరిదాకా కలిసి ఉన్న దిలీప్ కుమార్ (ఆయన ఈ మధ్యనే చనిపోయారు) సైరాభానుల స్టోరీ చాలా భిన్నం అనే చెప్పుకోవాలి. వాళ్లిద్దరికీ ఏకంగా 22 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది. సైరా చిన్నది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...