Home Special Looks వీళ్ళిద్దరూ భార్యా భర్తలని మీకు తెలుసా?!
Special Looks

వీళ్ళిద్దరూ భార్యా భర్తలని మీకు తెలుసా?!

Do You Know That These Actors Are Couples

వాళ్ళిద్దరూ తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన వాళ్ళే. ఎన్నో సినిమాల్లో మనకు కనిపించారు. ముఖ్యంగా ఆమె సినిమాల ద్వారా.. అతను సీరియల్స్ ద్వారా తెలుగువాళ్ళకి బాగా దగ్గరయ్యారు. కానీ, వాళ్ళిద్దరూ ఒక్కటైన విషయం చాలా మందికి తెలీదు. ముందుగా అతని గురించి మాట్లాడదాం.

ఆయన పేరు హర్ష. అప్పట్లో అమృతం సీరియల్ ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న హర్ష హాస్య నటుడిగా పలు సీరియల్స్ లో, ఇంకా సినిమాల్లోనూ మనకు కనిపించారు. ఇప్పటికీ సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ.. తన కెరీర్ ని కొనసాగిస్తున్నారు హర్షవర్ధన్. జీవితం, వ్యవస్థ, సామాజిక సమస్యలు వంటి విషయాలపై మాట్లాడి హర్షవర్ధన్ గారు కూడా మంచి ఆలోచనా పరుడని కూడా నిరూపించుకున్నారు. హర్ష స్వయంగా రైటర్ కూడా. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఇష్క్’, ‘మనం’ వంటి హిట్ సినిమాలకి డైలాగ్స్ రాసారు హర్ష.

ఇక ఆమె గురించి. ఆమె పేరు సత్య క్రిష్ణన్. ఆమె పేరు మనకి తెలియక పోవచ్చు కానీ చాలా సినిమాల్లో ఆమెని తెలుగు ప్రేక్షకులు చూడటం జరిగింది. ముఖ్యంగా మెంటల్ క్రిష్ణ సినిమా కాంట్రావర్షియల్ అవడం ద్వారా.. అందులో లేడీ రోల్ చేసిన సత్య కూడా వార్తల్లోకి వచ్చారు. చాలావరకు సినిమాల్లో డీసెంట్ రోల్స్ ప్లే చేసే ఆమె తెలుగువాళ్ళకి సుపరిచితమైన వ్యక్తే. మొదటి సారి శేఖర్ కమ్ముల ద్వారా మూవీస్ లోకి వచ్చిన ఆమె ఒక బ్యాంక్ ఎంప్లాయీ. నటనలో ప్రవేశం ఉందని తెలిసి ఇక మెల్లగా ఒక్కో సినిమాలో రోల్స్ ప్లే చేస్తూ.. సినీ రంగంలోనే స్థిరపడిపోయింది. ‘బొమ్మరిల్లు’, ‘వినాయకుడు’, ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ వంటి సినిమాల ద్వారా ఆమెకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లభించింది.

ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ విషయం పెద్దగా వార్తల్లోకి రాలేదు. బహుశా వీళ్ళు అంత పాపులర్ వ్యక్తులు కాకపోవడం కూడా కారణం కావచ్చు. ఇలా మనకి తెరమీద బాగా తెలిసిన వ్యక్తులు నిజజీవితంలో భార్యా భర్తలని తెలుసుకోవడం కాస్త చిత్రంగానే అనిపిస్తుంది కదా..!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...