Home Special Looks హీరా రాజగోపాల్ ఏమైపోయారు.. అజిత్ తో ఆమె ప్రేమ కథ ఎందుకు విఫలమైంది?
Special Looks

హీరా రాజగోపాల్ ఏమైపోయారు.. అజిత్ తో ఆమె ప్రేమ కథ ఎందుకు విఫలమైంది?

1992 లో వచ్చిన పబ్లిక్ రౌడీ, 94 లో వచ్చిన దొంగల రాజ్యం, 96 లో శ్రీకారం, లిటిల్ సోల్జర్స్, 97 లో చెలికాడు, ఆహ్వానం ఆ తర్వాతి సంవత్సరం ఆవిడ మా ఆవిడే, అంతపురం, పాడుతా తీయగా, యువరత్న రాణా, తర్వాత పెద్ద మనుషులు, అల్లుడు గారు వచ్చారు వంటి సినిమాల్లో నటించిన హీరా రాజగోపాల్ చాలా మందికే తెలిసే ఉంటుంది. ప్రధానంగా తమిళ్, మలయాళంలో సినిమాల్లో నటించిన హీరా నటనకి అందం కూడా తొడవడంతో.. ఒక పెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. హిందీలో కూడా వచ్చిన ఎన్నో అవకాశాల్ని ఆమె ఉపయోగించుకుంది.

ఐతే, హీరా గురించి మాట్లాడేపుడు మనకు గుర్తొచ్చే ఒక ముఖ్య వ్యక్తి ప్రస్తుత తమిళ్ బడా హీరో అజిత్. ఆయన ఒకప్పుడు హీరా రాజగోపాల్ ని ఎంతో ప్రేమించాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం అప్పట్లో పెద్ద వార్తగా మారిందని చెప్పవచ్చు. కానీ, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సహజీవనం విషయం బహిర్గతం అయినప్పటికీ వాళ్ళ ప్రేమ ఫలించటానికి గల కారణం చూస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కథ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అజిత్ ఒకప్పుడు చిన్న నటుడిగా తమిళ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అతనికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. అవకాశాలు దొరకక బీ గ్రేడ్ సినిమాల్లో కూడా చేసేవాడట. అలాంటి అజిత్ ఒకసారి షూటింగ్ లో హీరా రాజగోపాల్ ని కలుసుకున్నాడు. ఇక అప్పటినుండి ఆమెతో ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. కానీ, అప్పటిదాకా ఒక చిన్న నటుడిగా మాత్రమే ఉన్న అజిత్.. చాలా పెద్ద సెలబ్రిటీగా ఉన్న హీరోయిన్ హీరాతో ఇమడలేకపోయాడు. ఆ తర్వాత హీరానే స్వయంగా అజిత్ కి సినిమా అవకాశాలు ఇప్పించేదట. వేరే వేరే ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉన్న హీరా అజిత్ తో టైమ్ స్పెండ్ చేయడం కోసం అతనితో హీరోయిన్ గా నటించడానికి డేట్స్ ఓకే చేసుకునేదట. అంతలా అతన్ని ప్రేమించిన హీరాని అజిత్ వదిలేయడానికి ఒక పెద్ద కారణమే ఉంది.

హీరాకి ఉన్న ఫేమ్ కి తగ్గట్టు.. తన జీవితాన్ని చాలా లావిష్ గా గడిపే ప్రయత్నం చేసేది ఆమె. అజిత్ కూడా పెద్ద సెలబ్రిటీగా మారిన తర్వాత.. తన కెరీర్ లో ఒక విధంగా వెనక్కి పడిపోవడం జరిగింది. ఆమెకి మెల్లగా డ్రగ్స్ అలవాటు అయ్యాయి. అప్పటికే ఒక సంవత్సరం పాటు.. ఆమెతో డేటింగ్ లో ఉన్న అజిత్ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నాడు. కానీ హీరా డ్రగ్స్ కి అలవాటు పడిపోయి.. అజిత్ కి భారంగా మారిపోయింది. అజిత్ ఇక ఆమెని భరించలేక వదిలేసాడట. ఆ తర్వాత తన బ్రేకప్ విషయాన్ని పబ్లిక్ కి తెలియజేసే సంధర్భంలో హీరాకి ఉన్న డ్రగ్స్ అలవాటు గురించి కూడా చెప్పేసాడట అజిత్. ఇక అంతే.. హీరా అప్పటి దాకా సంపాదించుకున్న మంచి గుర్తింపు ఒక్కసారిగా పోయినట్లయింది.

తనని తాను సమర్థించుకునే ప్రయత్నంలో హీరా.. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఖండిస్తూ మాట్లాడింది. మేమిద్దరం విడిపోవడంలో నా పాత్ర ఏమీ లేదని.. అజిత్ స్వయంగా తనంతట తానుగా నన్ను వదిలేసాడని చెప్పింది. ఆ తర్వాత హీరా వేరొకరిని పెళ్లి చేస్కుని.. ఆ విషయాన్ని కనీసం మీడియాకి కూడా తెలియనీయలేదు. అజిత్.. హీరాతో ఎపిసోడ్ తర్వాత స్వాతి అనే హీరోయిన్ ని ప్రేమించాడు. ఆ తర్వాత షాలినిని పెళ్లి చేసుకుని ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. లేడీ ఫాలోయింగ్ బాగా ఉన్న అజిత్ అప్పట్లో ఇలాంటి స్టోరీస్ చాలానే నడిపాడు అన్నమాట.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...

చెవిటి, మూగ అయినా అందం ‘అభినయం’ ఆమెని ఆపలేదు..

ఆమెకి చెవులు వినిపించవు. మాట్లాడటం కూడా రాదు. కానీ, తెలుగు తమిళ రెండు భాషల్లోనూ చాలా...