Home Film News Rashmika: ర‌ష్మిక బోల్డ్ కామెంట్.. ఆ ముగ్గురు హీరోల‌కి మాత్ర‌మే లిప్ లాక్..!
Film News

Rashmika: ర‌ష్మిక బోల్డ్ కామెంట్.. ఆ ముగ్గురు హీరోల‌కి మాత్ర‌మే లిప్ లాక్..!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.  తన అందం, నటనతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న ర‌ష్మిక ..టాలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది.  ఈ అమ్మ‌డు ఇటీవ‌ల త‌న అంద‌చందాల‌తోను అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమ‌లో ఉందనే వార్త‌ల‌తో కూడా హాట్ టాపిక్ అవుతుంది. ఆ మధ్య రిపోర్ట‌ర్.. ర‌ష్మికని  మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు..? మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు..? అని ప్రశ్నించ‌గా, దానికి స్పందించిన ర‌ష్మిక‌.. ‘నాకు ఎప్పుడో పెళ్లైపోయింది’ అని చెప్పి అందరికి పెద్ద షాకిచ్చింది. ‘నాకు నరుటో తో పెళ్లైపోయింది. నా మనసులో అతడే ఉన్నాడు అని చెప్పుకొచ్చింది ర‌ష్మిక‌.

ఆ న‌రుటో ఎవ‌ర‌నే డౌట్ అంద‌రికి వ‌చ్చింది. జపనీస్ వెబ్ సిరీస్ ‘నరుటో’ లోని ఫేమస్ పాత్ర కాగా, ఈ సిరీస్ కు అందులోని పాత్రలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. న‌రుటో పేరు చెప్పి ఒక్క‌సారి అంద‌రికి ఝ‌ల‌క్ ఇచ్చింది ర‌ష్మిక‌. ఈ అమ్మ‌డు ఇటీవ‌ల బాలీవుడ్‌లో చేసిన సినిమాలు మంచి స‌క్సెస్‌ని అందించ‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం ర‌ష్మిక హోప్స్ అన్నీ కూడా పుష్ప‌2 పైనే పెట్టుకుంది. పుష్ప చిత్రంతో ర‌ష్మిక‌కి పాన్ ఇండియా స్టార్డం రాగా, పుష్ప 2 చిత్రంతో ఈ అమ్మ‌డి క్రేజ్ మరింత పెర‌గ‌నుంద‌ని అంటున్నారు. దీంతో పాటు ర‌ష్మిక‌..  సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’తోపాటు ‘రెయిన్‌ బో’ అనే  లేడి ఓరియెంటెడ్‌ సినిమాలు కూడా చేస్తుంది.

కెరీర్ పరంగా ఎలా ఉన్న‌ప్ప‌టికీ,  వ్యక్తిగతంగా చూస్తే.. రష్మిక విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తోందనే ప్ర‌చారం ఉంది. వీరు  ఈ విషయాన్ని పైకి చెప్పట్లేదు  కానీ సీక్రెట్ గా మాత్రం వెకేషన్లకు వెళుతూ వ‌స్తున్నారు.  రీసెంట్‌గా  రష్మిక తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఇందులో నెటిజన్లు  అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు ఇచ్చింది.  విజయ్ దేవరకొండతో మీ తర్వాత మూవీ ఎప్పుడు ఉంటుంది అని ఓ నెటిజన్ అడగ‌గా,  అది మీరు విజయ్ నే అడగాలి అని చెప్పింది రష్మిక.  ఇక మంచి స్టోరీతో ఎవరైనా డైరెక్టర్ వస్తే చేయడానికి మేం రెడీగా ఉన్నామని పేర్కొంది.. విజయ్ దళపతి, షారుఖ్, విజయ్ దేవరకొండలలో మీరు ఎవరికి లిప్ లాక్ ఇస్తారు అని మరో నెటిజన్ అడగ‌గా, ఆమె షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చింది. ముగ్గురికి ఇచ్చేస్తాను అని చెప్ప‌డంతో  ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక‌ రష్మిక అనేక విషయాలను తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...