Home Film News JD Chakravarthy: ఆ టాప్ ద‌ర్శ‌కుడికి మైండ్ దొబ్బిందంటూ జేడీ చ‌క్ర‌వర్తి ఘాటు కామెంట్స్
Film News

JD Chakravarthy: ఆ టాప్ ద‌ర్శ‌కుడికి మైండ్ దొబ్బిందంటూ జేడీ చ‌క్ర‌వర్తి ఘాటు కామెంట్స్

JD Chakravarthy: ఒక‌ప్పుడు వైవిధ్య‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రించిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి రీసెంట్‌గా ద‌యా అనే వెబ్ సిరీస్‌తో ప‌ల‌కరించాడు. ఈ వెబ్ సిరీస్‌కి ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రామ్ గోపాల్ వ‌ర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న జేడి అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌కుడు తేజ గురించి దారుణ‌మైన కామెంట్స్ చేస్తుంటారు. తేజ కూడా వ‌ర్మ శిష్యుడే అయిన ఎందుకో ఈ ఇద్ద‌రికి అస్స‌లు ప‌డ‌దు. ఒక‌రి గురించి మ‌రొక‌రు ఎన్నో విమ‌ర్శ‌లు చేసుకుంటారు. తాజాగా తేజ‌పై జేడి చక్ర‌వ‌ర్తి ప‌లు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న ప్రేమ‌కి, పెళ్లికి తేజ సాయం చేసాన‌ని చెబుతుంటాడు అని , ఆయ‌న చెప్పే అబ‌ద్ధాల‌లో ఇది కూడా ఒక‌ట‌ని జేడి అన్నారు.

తేజ నాకు పెళ్లి చేశాడ‌ని నేను ఎప్పుడు చెప్ప‌లేదు. అత‌ను వేసిన ప్లాన్‌తో ఎస్కేప్ అయి వ‌చ్చాను అన్నాను త‌ప్ప పెళ్లి చేశాడ‌ని ఏనాడు చెప్ప‌లేదు. అస‌లు  తేజ చేసిన  చెత్త ప‌ని ఏంటంటే..15, 20 ఏళ్ల కిందట సితార మ్యాగజైన్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో  తన పెళ్లి చేశానని, తన ప్రేమని గెలిపించానని, నెల్లూరు వెళ్లాం అని ఏవేవో చెప్పాడు. కాని అదంతా అవాస్త‌వం. అత‌ను చెప్పిన మాట‌ల‌కి నిజానికే జాలి వేసింది. తేజ చెప్పిన వాటిలో నిజాలు త‌క్కువ‌, అబ‌ద్ధాలు ఎక్కువ ఉంటాయి. తేజ చెప్పిన‌ప్పుడు ఆయ‌న ఏదైన స‌మ‌స్య‌లో అయిన ఉండి ఉండాలి, లేకుంటే మైంబ్ అయిన దొబ్బి ఉండాలి అని షాకింగ్ కామెంట్స్ చేశారు జేడి చక్ర‌వ‌ర్తి.

జేడీ చక్రవర్తి  ప్ర‌ధాన పాత్ర‌లో దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ద‌యా వెబ్ సిరీస్ లో జేడీ సరసన ఈషా రెబ్బా నటించారు.  ఆగస్టు 4 నుంచిఈ వెబ్ సిరీస్  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  ‘దయా’లో త‌న పాత్ర గురించి జేడీ ముందే రివీల్ చేసిన విష‌యం తెలిసిందే. తాను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తానని, చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం తన పని అని జేడీ అన్నారు. ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుందని, పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదని, ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుందని స్ప‌ష్టం చేశారు. రానున్నరోజుల‌లో జేడీ సినిమాలు కూడా చేసే అవ‌కాశం ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...