Home Film News KGF Music Director: ఒక్క‌పూట తిండి కోసం కిడ్నీ అమ్ముకోవాల‌ని అనుకున్న కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్
Film News

KGF Music Director: ఒక్క‌పూట తిండి కోసం కిడ్నీ అమ్ముకోవాల‌ని అనుకున్న కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్

KGF Music Director: క‌న్న‌డ సూప‌ర్ హిట్ చిత్రం కేజీఎఫ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  ఈ సినిమాతో కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. రాఖీ భాయ్‌గా మారిపోయి ప్ర‌భంజ‌నం సృష్టించాడు. కేజీఎఫ్ అనే  చిత్రం కన్నడ చిత్రసీమను తలెత్తుకునేలా చేసింది. దేశం మొత్తం కన్నడ పరిశ్రమ వైపు తిరిగి చూసేలా చేసిన కేజీఎఫ్  చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 కూడా రూపొందించారు. ఇది కూడా మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఇంత పెద్ద విజ‌యం సాధించిన ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ర‌వి బ‌స్రూర్ జీవితంలో ఎంతో దీనగాథ ఉంది. కేజీఎఫ్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ర‌వి బ‌స్రూర్..  బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ పాటలకు కూడా బాణీలు స‌మకూర్చారు.

ర‌వి బ‌స్రూర్ త‌న సంగీత ప్ర‌స్థానంలో ఎన్నో క‌ష్టాల‌ని చ‌వి చూసి ఇన్నాళ్ల‌కు విజేత‌గా నిలిచాడు. ఒకానొక సమయంలో ఒక‌ పూట గడవక.. తన రెండు కిడ్నీల్లో ఒకటి అమ్ముకోవాలని కూడా అనుకున్నాడ‌ట‌.  ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా అవకాశాలు చూసుకుంటేనే… మరోవైపు కుటుంబ పోషణ కోసం తన కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన శిల్ప కళపై ఆధార‌ప‌డ్డాడు. శిల్పిగా పనిచేస్తూనే.. పెయింటర్‌గా.. కార్మికుడిగా… టైలర్‌గా అష్ట‌క‌ష్టాలు ప‌డ్డాడు. ఆయ‌న 8వ త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దివిన‌ట్టు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పాడు. అది కూడా ఫెయిల్ అయిన‌ట్టు స్ప‌ష్టం చేశాడు.

ఓ సారి బొంబాయి నుంచి మంగళూరు వస్తున్నప్పుడు నా ప‌రిస్థితి త‌ల‌చుకొని రైలులోని టాయిలెట్‌లో కూర్చొని ఏడిచిన సందర్భాలున్నాయి. ఇంటి నిర్వహణ బాధ్యత మొత్తం నాదే. అందు కోసం నా కిడ్నీ అమ్మేందుకు కూడా రెడీ అయ్యాను. కిడ్నీ అమ్ముకునేందుకు మంగళూరు ఆసుపత్రికి వచ్చిన సందర్భాన్నికూడా ఆయ‌న‌ ప్రస్తావించారు.  అయితే ఆపరేషన్‌ థియేటర్‌లోకి వెళ్లేలోపే భ‌య‌ప‌డి ఆసుపత్రి నుంచి తాను పారిపోయిన‌ట్టు రవి బస్రూర్ పేర్కొన్నాడు. బ‌తుకుతెరువు కోసం పబ్లిక్ టాయిలెట్‌లో వాచ్‌మెన్‌గా కూడా ప‌ని చేశాడ‌ట‌. ఎన్నో క‌ష్టాల‌ని ఫేస్ చేసి చివ‌ర‌కు ఇప్పుడు ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు ర‌వి బస్రూర్.

Related Articles

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’… ఈ డైలాగ్ బాల‌య్యది కాద‌ని తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ చిత్రంలో ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ అనే డైలాగ్‌...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...