Home Film News అయోధ్యకు ఆ చిన్న కారణంతోనే ఎన్టీఆర్- ప్రభాస్ వెళ్లలేదా..!?
Film News

అయోధ్యకు ఆ చిన్న కారణంతోనే ఎన్టీఆర్- ప్రభాస్ వెళ్లలేదా..!?

భారతదేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ఎంతో ఘనంగా ఎవరూ ఊహించిని విధంగా జరిగింది. దేశం మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం రాముడి నామాలు, జై శ్రీరామ్ నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమోగింది. ఈ అద్భుతమైన వేడుకను చూసేందుకు దేశవ్యాప్తంగా పలు భాషలకు చెందిన ఎంతోమంది అగ్ర ప్రముఖులు, స్టార్ హీరోలు అయోధ్యకు వెళ్లారు. ఇక మన సౌత్ చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, రామ్ చరణ్, ధనుష్, బాలీవుడ్ నుంచి అమితాబ‌చ్చ‌న్‌, కంగ‌నా ర‌నౌత్ ఇలా ఎంతోమంది అయోధ్యకు వెళ్లి ఈ మహోన్నతమైన ఘట్టాన్ని స్వయంగా వీక్షించారు.

అయితే ఇదే సమయంలో అయోధ్య నుంచి కొందరు అగ్ర హీరోలకు ఆహ్వానం అందిన కూడా వారు ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడం కొంచెం ఆశ్చర్యంగా మారింది. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఈ మహా ఘట్టానికి ఆహ్వానం అందుకున్న స్టార్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కూడా ఉన్నారు. అయితే ముఖ్యంగా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్లకపోవడానికి ప్రధాన కారణం అదే రోజు తను నటించే తాజా మూవీ దేవరా షూటింగ్‌కు డేట్లు ఇచ్చారట. ప్రతిరోజు ఈ సినిమా కోసం వందల మంది షూటింగ్ చేస్తున్నారు. తాను అయోధ్య వెళితే నిర్మాతలకు భారీ నష్టం వస్తుందని ఎన్టీఆర్ ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారట.

అయితే అదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలో విల‌న్‌గా నటించే సైఫాలీ ఖాన్ గాయపడటం.. ఈ విషయం దేవర యూనిట్‌కు ఆలస్యంగా తెలియటంతో ఎన్టీఆర్ చివ‌రి నిమిషంలో అయోధ్య ట్రిప్ రద్దయింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నాగ్ అశ్విన్ ప్రెస్టేజ్ ప్రాజెక్టు కల్కి అలాగే మారుతి రాజాసాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులోనూ కల్కి ఒక్కరోజు షూటింగ్ ఆగిపోతూనే కోట్ల‌లో నష్టం వస్తుంది. ఈ కారణంతోనే ప్రభాస్ కూడా ఆహ్వానం వచ్చినప్పటికీ అయోధ్య వెళ్ళలేదట. ఇక ఇటీవల కృష్ణంరాజు జయంతి కార్యక్రమాల్లో కూడా ప్రభాస్ కనిపించలేదు. ఇక ఇప్పుడు ఏదేమైనా ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఆహ్వానం వచ్చినా కూడా అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లి అదృష్టం దక్కలేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...