Home Film News Adipurush: ఆదిపురుష్ దెబ్బ‌కు అక్క డ ఇండియ‌న్ చిత్రాల‌న్నీ బంద్..!
Film News

Adipurush: ఆదిపురుష్ దెబ్బ‌కు అక్క డ ఇండియ‌న్ చిత్రాల‌న్నీ బంద్..!

Adipurush: భారతీయ ఇతిహాస గాథ రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాల‌న్నింటికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇక ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ అనే చిత్రం తెర‌కెక్క‌డంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఏర్ప‌డ్డాయి. అయితే కొంద‌రు మాత్రం మూవీ టీజ‌ర్‌,ట్రైల‌ర్ చూసి పెదవి విరిచారు. క‌థ‌ని పూర్తిగా వ‌క్రీక‌రించార‌ని, సంభాష‌ణ‌లు ఏమంత బాగోలేవని కొంద‌రు మండిప‌డ్డారు.ఈ నేపథ్యంలో  నేపాల్ దేశంలో ఇండియన్ సినిమాలపై కీలక నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. నేపాల్‌లోని పోఖరా మెట్రోపాలిటన్ సిటీలో ఆదిపురుష్ సినిమాలోని ఒక డైలాగ్‌పై వివాదం త‌లెత్త‌డంతో భార‌తీయ చిత్రాల ప్రదర్శనను నిషేధించాలని ఖాట్మండు పోఖరా మేయర్ నిర్ణయం తీసుకున్నారు.

రాముని సతీమ‌ణి నేపాల్ లో పుట్టిన‌ట్టు చ‌రిత్ర చెబుతుండ‌గా, ఆదిపురుష్ చిత్రంలో మాత్రం ఇండియాలో పుట్టినట్టు చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కారణంగా నేపాలీ నగరంలోని సినిమా హాళ్లలో  బాలీవుడ్ చిత్రాల ప్రదర్శనను నిలిపివేయాలని పోఖరా మేయర్ ధనరాజ్ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు.   ‘ఆదిపురుష్’ చిత్రంలో సీత జన్మస్థలం  గురించిన తప్పును సవరించకపోతే ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్‌తో పాటు ఏ భారతీయ చిత్రాలను ప్రదర్శించేందుకు అనుమతించబోమని ఆయన పేర్కొన్నారు. నేపాల్ సెన్సార్ బోర్డ్ కూడా ఇదే కారణంతో చిత్ర ప్రదర్శనకు అనుమతి నిరాకరించింది. ఈ క్రమంలోదిగొచ్చిన చిత్ర  మేక‌ర్స్ దిద్దుబాటు చర్యలు మొద‌లు పెట్టింది.

సీత భారతదేశపు కుమార్తె అని ఆదిపురుష్ చిత్రంలో ప్ర‌స్తావించ‌డంతో  గురువారం ట్వీట్‌ చేసిన కాఠ్మండు మేయర్ షా.. ఇండియా, నేపాల్‌లో ఆ డైలాగ్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.  చిత్ర‌ మేకర్స్ క‌నుక‌ ఈ డైలాగ్‌ను తొలగించకుంటే సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వబోమని వారు తేల్చి చెప్పారు. ఇక  ఇప్పటికే చిత్రంలోని ప్రేక్షకులకు ఇబ్బంది కలిగే కొన్ని డైలాగ్స్ ను కూడా మార్చబోతున్నామని మేకర్స్ ప్రకటించిన విషయం మ‌న‌కు విదిత‌మే.  న్యూ వెర్ష్ న్  ని మ‌రో వారంజ రోజుల్లో ఆడియెన్స్  థియేటర్లలో చూడొచ్చు అయితే ఏది ఏమైనా సినిమాకి నెగెటివ్ టాక వ‌స్తున్నా కూడా ఆదిపురుష్‌ మూడు రోజుల్లో రూ.300 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...