Home Film News Samantha: స‌మంత ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించిందా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్
Film News

Samantha: స‌మంత ఆరోగ్యం మ‌ళ్లీ క్షీణించిందా.. ఆందోళ‌న చెందుతున్న ఫ్యాన్స్

Samantha: అందాల ముద్దుగుమ్మ స‌మంత ప్ర‌స్తుతం జీవితంలో క‌ఠిన ప‌రీక్ష‌లు ఎదుర్కొంటుంది. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న స‌మంత ఎవ‌రు ఊహించ‌ని విధంగా నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. విడాకుల త‌ర్వాత చాలా రోజుల పాటు డిప్రెష‌న్‌లో ఉన్న స‌మంత తిరిగి సినిమాల‌తో బిజీ అయింది. ఆ స‌మ‌యంలోనే ఈ అమ్మ‌డు మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ్డ‌ట్టు తేలింది.మ‌యోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి బారిన స‌మంత ప‌డ‌డంతో ఆమె కొన్నాళ్ల పాటు సినిమాల‌కి దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంది. ఇక కాస్త కోలుకున్న త‌ర్వాత స‌మంత తిరిగి తను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. దాదాపు తాను క‌మిటైన ప్రాజెక్ట్స్ పూర్త‌య్యాయ‌ని తెలుస్తుండ‌గా, ఇక ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కి సంత‌కం చేయ‌డం లేదు.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత‌… ఇటీవ‌ల త‌న పోస్ట్‌లో పర్టిక్యులర్‌గా 6 నెల‌లు క‌ష్టంగా గ‌డిచింద‌ని పేర్కొంది. మ‌యోసైటిస్ నుండి కాస్త కోలుకున్న త‌ర్వాత  విరామం లేకుండా సినిమా సెట్స్ పై కదులుతోంది సమంత. ఈ క్రమంలోనే ఆమె ఇలా పోస్ట్ పెట్టి ఉండవచ్చని అంద‌రు అనుకున్నారు. అయితే స‌మంత ఇటీవ‌ల ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే అంద‌రు స‌మంత విశ్రాంతి కోస‌మే బ్రేక్ తీసుకుంద‌ని అనుకున్నారు. కాని ఆమెకు మయోసైటిస్ తిర‌గ‌బెట్టింద‌ని, ఆరోగ్యం కూడా క్షీణిస్తూ ఉండ‌డంతో ద‌క్షిణ కొరియా వెళ్లేందుకు సిద్ద‌మైందట‌. అక్క‌డ ట్రీట్‌మెంట్ పూర్తిగా తీసుకొని త‌ర్వాత ఇండియాకి రానుంద‌ని చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ సమంత ఏడాది పాటు  సినిమాలకు దూరంగా ఉంటుందనే విషయాన్ని  ఫ్యాన్స్ అయితే ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు.  మయోసైటిస్‌ వ్యాధికి చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకుంద‌నే విష‌యం అయితే  బయటకొచ్చింది. ఇక  యశోద, శాకుంతలం చిత్రాల‌ తర్వాత సమంత .. విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమా చేస్తోంది.  శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి కొద్ది రోజుల క్రితం గుమ్మడికాయ కొట్టారు. ఇక స‌మంత‌ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుండగా, అది కూడా పూర్తి కావ‌డానికి వ‌చ్చింది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...