Home Film News Rashmika: స్టార్ హీరోయిన్ ర‌ష్మిక‌ ద‌గ్గ‌ర ఉన్న ల‌గ్జ‌రీ ఐటమ్స్ ఏంటో తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..!
Film News

Rashmika: స్టార్ హీరోయిన్ ర‌ష్మిక‌ ద‌గ్గ‌ర ఉన్న ల‌గ్జ‌రీ ఐటమ్స్ ఏంటో తెలిస్తే నోరెళ్ల‌పెడ‌తారు..!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఇప్పుడు తెలుగు వారికే కాకుండా తమిళం,హిందీ ప్రేక్ష‌కుల‌కి కూడా క‌ల‌ల రాణే. కెరీర్ మొద‌ట్లో చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ర‌ష్మిక ఇప్పుడు మాత్రం బ‌ట్ట‌ల సైజు బాగా త‌గ్గించేసి అంద‌రికి షాక్ ఇస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యాన్స్ తో ముచ్చ‌టిస్తుంది. రీసెంట్‌గా నెటిజ‌న్స్‌తో అనేక విష‌యాలు పంచుకుంది.  తనకు ఆరు భాషలు తెలుసని చెప్పిన ఈ భామ‌ ఇష్టమైన ప్రదేశం, తాను ఎక్కువగా సంతోషంగా ఉండే ప్లేస్  కూర్గ్‌లోని ఇళ్లు అని పేర్కొంది. ర‌ష్మిక ఇప్పుడు పుష్ప‌2 చిత్రంతో పాటు యానిమ‌ల్ అనే సినిమా చేస్తుంది.

తెలుగు – తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్ బో అనే సినిమాలోనూ ర‌ష్మిక న‌టిస్తుంది. ఈ చిత్రం భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతుంది. ప్ర‌స్తుతానికి ర‌ష్మిక చేతిలో అర‌డ‌జ‌నుకి పైగా క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉండ‌డంతో ఈ అమ్మ‌డు  నితిన్ – వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేక త‌ప్పుకుంది.  గతంలో నితిన్ – రష్మిక కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనంద‌రికి తెలిసిందే. అయితే తాజాగా ర‌ష్మిక గురించి ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ భామ సినిమాల్లోకి వచ్చి 7 ఏళ్లు అవుతుండ‌గా,  ఏమాత్రం సంపాదించింది? ఆమెకున్న ఆస్తులేంటి? అనే విషయాలపై సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

ర‌ష్మిక ప్ర‌స్తుతం సినిమాల్లో నటిస్తూనే  మరోవైపు యాడ్స్, ప‌లు ఈవెంట్స్‌తో రెండు చేతులా సంపాదిస్తుంది. ఈ క్ర‌మంలో అమ్మ‌డు చాలా ల‌గ్జ‌రీ లైఫ్ గడుపుతుంది. ర‌ష్మిక ద‌గ్గ‌ర  మెర్సిడెస్ బెంజ్ సీ క్లాస్ కారు ఉంది. దీని ధ‌ర‌ రూ.50 లక్షలు పైమాటే అంటున్నారు. అలానే ఆడి క్యూ 3 కారు కూడా ఉండ‌గా, రీసెంట్‌గా  టయోటా ఇన్నోవా హుండై క్రెటా కార్లను కూడా కొనుగోలు చేసిందని తెలుస్తుంది. ఇక ఆమె వాడే దుస్తులు, ఇల్లు,ప‌రిస‌రాలు అన్నింటిని కూడా చాలా ల‌గ్జ‌రీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంద‌ట‌. ర‌ష్మిక బిజినెస్‌ల వైపు కూడా దృష్టి సారిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...