Home Film News Mega Family: మెగా ఫ్యామిలీలో విడాకుల పర్వం.. ఇది ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుంది..!
Film News

Mega Family: మెగా ఫ్యామిలీలో విడాకుల పర్వం.. ఇది ఎక్క‌డ వ‌ర‌కు వెళుతుంది..!

Mega Family: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ ఫ్యామిలీ అంటే ఓ ప్ర‌త్యేక‌ అభిమానం ఉంటుంది. మెగా ఫ్యామిలీకి సొసైటీలో కూడా మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఈ మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోలు వచ్చి స్టార్స్ గా మారి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ మెగా ఫ్యామిలీలో మాత్రం విడాకుల పర్వం మాత్రం తలనొప్పిగా మారింది. మొదటగా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు విజయదుర్గ. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తల్లి అయిన విజ‌య్ దుర్గ‌.. ముందుగా శివ ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విజయదుర్గ తన భర్త నుండి విడాకులు తీసుకున్నారు.

చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మితకు మొదటగా హీరో ఉదయ్ కిరణ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల వారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యి.. మరో వివాహం చేసుకున్నారు. దీంతో అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ కూడా మొదట ప్రేమ వివాహం చేసుకుంది. తర్వాత విడాకులు తీసుకుని కుటుంబ సభ్యులు చూసిన కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. ఇప్పుడు మళ్లీ కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇచ్చిన‌ట్టు జోరుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఇక తాజాగా నిహారిక కూడా విడాకులు ఇచ్చేసింది. ఈమె చైతన్య జొన్నలగడ్డను 2020 డిసెంబర్ లో ఘనంగా పెళ్లి చేసుకుంది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరికీ జూలై 5 న విడాకులు మంజూరు అయ్యాయి. అయితే ఏప్రిల్ 1 వ తేదీన ఫ్యామిలీ కోర్టులో నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.

మెగా పవర్ స్టార్ గా ప్రేక్షకుల్లో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఆయన మొదటగా నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి.. హీరోయిన్ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రేణు దేశాయ్ కు విడాకులు ఇచ్చి.. ఆ తర్వాత మళ్లీ విదేశీ హీరోయిన్ అయిన అన్నా లెజ్నోవా ను పెళ్లి చేసుకున్నారు. అలా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.  అయితే ప‌వ‌న్ కూడా ఇప్పుడు త‌న మూడో భార్య‌తో విడాకులు  తీసుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది.  ఇలా మెగా ఫ్యామిలీలో విడాకుల పర్వం న‌డుస్తుండ‌డంతో మెగా అభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...