Home Film News Samantha: ముచ్చ‌టగా మూడోసారి ప్రేమ‌లో ప‌డ్డ స‌మంత‌.. ఈ సారి ఎవ‌రితో అంటే..!
Film News

Samantha: ముచ్చ‌టగా మూడోసారి ప్రేమ‌లో ప‌డ్డ స‌మంత‌.. ఈ సారి ఎవ‌రితో అంటే..!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత కెరీర్ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. ఇన్నాళ్లు టాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ఈ అమ్మ‌డి క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్‌కి కూడా పాకింది. బాలీవుడ్‌లోను త‌న స‌త్తా చూపిస్తూ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంటుంది. అయితే స‌మంత పర్సన‌ల్ లైఫ్ మాత్రం గంద‌ర‌గోళంగా ఉంది. ఇప్ప‌టికే స‌మంత త‌ను ఎంత‌గానో ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటుంది. ఆ మ‌ధ్య ఆమె అనారోగ్యం బారిన కూడా ప‌డింది. మ‌యోసైటిస్ వ్యాధితో చాలా రోజుల పాటు ఇంటికే ప‌రిమితమైంది. ఇటీవ‌ల కాస్త కోలుకున్న సామ్ తిరిగి సినిమా షూటింగ్స్ తో బిజీ అయింది.

అయితే స‌మంత ఇప్పుడు మ‌రోసారి ప్రేమ‌లో ప‌డ్డట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. స‌మంత జ‌బ‌ర్ధ‌స్త్ సినిమా స‌మ‌యంలో న‌టుడు సిద్ధార్థ్‌ని ల‌వ్ చేసింది. అతనిని వివాహం కూడా చేసుకోవాల‌ని అనుకుంది. కాని ఎందుకో వీరిద్ద‌రు బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇక కొద్ది రోజులకి నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్ల వైవాహిక బంధం త‌ర్వాత వీరు విడిపోయారు. ఇక ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి స‌మంత ప్రేమ‌లో ప‌డింద‌ని అంటున్నారు. రీసెంట్‌గా  ప్రేమ గురించి చెప్తూ సమంత చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు  అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది.

స‌మంత త‌న పోస్ట్‌లో చావునుంచి మనల్ని ఏదీ కాపాడలేనప్పుడు, కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి  అంటూ ఓ ప్రముఖ రచయిత కొటేష‌న్‌ని త‌న పోస్ట్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారంద‌రు ఏంటి స‌మంత మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డిందా అంటూ చర్చ‌లు మొద‌లు పెట్టారు. అయితే ఈ ప్ర‌చారాల‌పై స‌మంత ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ  అమ్మ‌డు ఇటీవ‌ల లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించింది. యశోద’, ‘శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలకి ప్రేక్ష‌కుల‌ని బాగానే ఆద‌రించారు. ఇప్పుడు బాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’ లో నటిస్తోంది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ తో కలిసి  ‘ఖుషి’  చిత్రం చేస్తుండ‌గా, రీసెంట్‌గా మూవీ షూటింగ్ పూర్తైంది.  సెప్టెంబర్ లో మూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...