Home Special Looks ఈ సీనియర్ నటుడు మెగాస్టార్ కి బాబాయ్ అని ఎంతమందికి తెలుసు..?!
Special Looks

ఈ సీనియర్ నటుడు మెగాస్టార్ కి బాబాయ్ అని ఎంతమందికి తెలుసు..?!

The Senior Actor Who Is Related To Mega Family

మెగా ఫ్యామిలీ అంటే మనకి ముందుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వంటివాళ్ళు గుర్తొస్తారు. కానీ, మెగా ఫ్యామిలీ నుండి అంతగా సక్సెస్ అవనివాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు అని మనం ఆలోచించం. అంటే.. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నది నాగబాబు గురించి కూడా కాదు. కానీ ఒక సీనియర్ సీరియల్ యాక్టర్ గురించి. చిరంజీవికి ఆయన బాబాయ్ అవుతారని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

అందుకు మరో కారణం ఆయన కేవలం ఒక సీరియల్ నటుడిగానే మిగిలిపోవడం కూడా కావచ్చు. కానీ, ఒకప్పుడు ఆయన సినిమాల ద్వారా కూడా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేసారు. ‘ఇంద్ర’ సినిమాలో ఇంద్రన్న అంటూ పిలిచే క్యారక్టర్ ఆయనే. అవేమీ పెద్దగా ఫలించకపోయినా.. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆయన పేరే హరి. పూర్తిపేరు హరిబాబు. వరసకి బాబాయ్ అయినప్పటికీ.. చిరంజీవి గారు ఎప్పుడూ హరిని బాబాయ్ అని పిలవలేదు.

ఇందుకు కారణం వాళ్ళిద్దరి మధ్య పెద్దగా వయసు భేదం లేకపోవడం. హరితో పాటు ఎవరిని కలిసినా.. చిరంజీవి గారు అతన్ని మిగతావాళ్ళకి కజిన్ అని చెప్పి పరిచయం చేస్తాడట. సినిమాల్లోకి రాకముందు పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేసిన హరి గారు, తర్వాత ఆయనకి నచ్చిన వ్యాపారాల్లో అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం కూడా చేసారు. కానీ, అవేమీ ఫలించకపోవడంతో చిరంజీవిని సంప్రదించడం ద్వారా.. నటనలో కొన్ని మెళకువలు తెలుసుకుని ఇక మెల్లగా అక్కడినుంచి అవకాశాలు సంపాదించుకున్నారు. చివరికి.. కొన్ని సినిమాల్లో చేసిన తర్వాత ఇప్పటికీ ఆయన కొన్ని టీవీ ఛానళ్లలో సీరియల్ విలన్ గా కనిపించడం చూస్తూ ఉంటాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...

38 ఏళ్ల కెరీర్ లో విక్ట‌రీ వెంక‌టేష్ ఎన్ని సినిమాలను రిజెక్ట్ చేశారు.. అందులో హిట్లు ఎన్నో తెలుసా?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక...