Home Film News Ghattamaneni family: ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తానికి కామ‌న్‌గా ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. ?
Film News

Ghattamaneni family: ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తానికి కామ‌న్‌గా ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా.. ?

Ghattamaneni family: తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే అద్భుత‌మైన న‌టుల‌లో కృష్ణ ఒక‌రు. ఆయ‌న ఎన్నో అద్భుత‌మైన పాత్ర‌ల‌లో న‌టించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నారు. కృష్ణ ఏడాదికి దాదాపు ప‌ది సినిమాలు కూడా చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. నిర్మాత‌ల హీరో అని పేరు తెచ్చుకున్న కృష్ణ ఆప‌ద‌లో ఉన్న స‌మ‌యంలో చాలా మందిని ఆదుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ ఎంత జాలి గలవాడ‌నేది. ఎవ‌రికైన కష్టం అని తెలిస్తే వెంట‌నే  వాళ్లు  సహాయం అడగకపోయినా సరే ఇంటికి పిలిపించుకుని మరి డబ్బుని వాళ్లకు ఇచ్చేస్తారు కృష్ణ‌. అవే క్వాలిటీస్ ఆయ‌న త‌న‌యుడు మ‌హేష్ బాబుకి కూడా వ‌చ్చాయి. కృష్ణ వార‌సుడి ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన మ‌హేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగాడు. అలానే మంచి మ‌న‌సున్న మ‌నిషిగా ప్ర‌శంస‌లు అందుకున్నాడు.

మహేష్ బాబు ఇప్పటికే ఎన్ని సేవా కార్యక్రమాలు చేప‌డుతున్నారు.  చిన్నపిల్లలకు సంబంధించిన గుండె జబ్బులు నయం చేసేందుకు మహేష్ బాబు తీసుకున్న నిర్ణయంపై ప్ర‌తి ఒక్క‌రు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇదే కాక కొన్ని గ్రామాలని ద‌త్త‌త తీసుకున్నారు. ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్నారు. ఇక  ఆయన కడుపున పుట్టిన సితార సైతం సేవా కార్యక్రమాల్లలో పాల్గొంటూ ఉంటుంది. త‌న  పుట్టినరోజు సందర్భంగా స్కూల్ పిల్లలకు సైకిల్ పంపిణీ చేసి అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. ఇక సితార అన్న గౌత‌మ్ లో కూడా అదే క్వాలిటీ ఉంది.   గౌతం చేసిన మంచి పని గురించి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

మహేష్ బాబు కొడుకు గౌతమ్ రీసెంట్గా రెయిన్ బో హాస్పిటల్స్ వెళ్లి అక్క‌డి పేషెంట్స్ ని క‌లిసి వారితో స‌ర‌దాగా గ‌డిపారు.  చిన్నారులను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించ‌డంతో వారు చాలా ఖుష్ అయ్యారు. తన స్కూల్ ముగిసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లి హార్ట్ సర్జరీ చేయించుకున్న చిన్నారులను పరామర్శించినట్లు న‌మ్ర‌త చెప్ప‌డంతో పాటు అందుకు సంబందించిన పిక్స్ కూడా షేర్ చేసింది.  ఇలా సూపర్ స్టార్ కృష్ణ కి ఉన్న గుణం ఫ్యామిలీలో అందరికీ రావ‌డంతో  ఘట్టమనేని కుటుంబం నింజంగా గ్రేట్ అని  అప్రిషియేట్ చేస్తూ వారు  ఫొటోస్ ని తెగ‌ ట్రెండ్ చేస్తున్నారు..!!

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...