Home Film News Balayya-Sridevi: బాల‌కృష్ణ‌, శ్రీదేవి క‌లిసి ఒక్క సినిమా చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం?
Film News

Balayya-Sridevi: బాల‌కృష్ణ‌, శ్రీదేవి క‌లిసి ఒక్క సినిమా చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం?

Balayya-Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి మ‌న మ‌ధ్య లేక‌పోయిన కూడా ఆమె జ్ఞ‌పకాలు మాత్రం ఇప్ప‌టికీ అభిమానుల మ‌న‌సులలో మెదులుతూనే ఉన్నాయి. బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ తరువాత హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో న‌టించి స్టార్ హీరోయిన్‌గా మారింది. తెలుగు, త‌మిళం, హిందీ ఇలా ప‌లు భాష‌ల‌లో త‌న న‌ట‌న‌తో మెప్పించింది. ఎంతో మంది స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టించిన శ్రీదేవి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే తెలుగులో అప్ప‌టి స్టార్స్ అంద‌రితో క‌లిసి న‌టించిన శ్రీదేవి.. నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌తో ఒక్క సినిమా కూడా చేయ‌లేదు.

బాల‌య్య లాంటి స్టార్ హీరోతో శ్రీదేవి సినిమా చేయ‌క‌పోవ‌డం ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌మే. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణ చిన్న వయసులోనే వెండితెర ఎంట్రీ ఇచ్చారు. తాత‌మ్మ క‌ల అనే చిత్రంతో తొలిసారి వెండితెర‌పై బాల‌య్య క‌నిపించ‌గా, 1984లో వచ్చిన ‘సాహసమే జీవితం’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇక అప్ప‌టి నుండి వెన‌క తిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు బాల‌య్య‌. ఆయ‌న త‌న కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో న‌టించాడు. చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన రాశి లాంటి వారితోనూ బాలకృష్ణ నటించారు. కాని అతిలోక సుందరి శ్రీదేవితో మాత్రం నటించలేదు. అయితే 1987లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు బాలకృష్ణ, శ్రీదేవిలతో కలిసి ‘సామ్రాట్ ’అనే సినిమా తీయాల‌ని అనుకున్నాడు.

 

1989లో ఎ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ‘భలే దొంగ’ అనే సినిమాలో కూడా శ్రీదేవిని తీసుకోవాల‌ని అనుకున్నారు.. కానీ ఆ సమయంలో శ్రీదేవి హిందీ సినిమాలతో బిజీగా ఉండ‌డం వ‌ల‌న కుద‌ర‌లేదు. ఇక బాలకృష్ణ, శ్రీదేవిలు కలిసి రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, అనురాగదేవత అనే సినిమాల్లో క‌నిపించిన‌ప్ప‌టికీ, వారిద్ద‌రు మాత్రం క‌నిపించింది లేదు. కాగా, శ్రీదేవి.. మెగాస్టార్ తో ఎక్కువ సినిమాలు చేసింది . ఇక వెంకటేశ్. నాగార్జున‌తో క‌లిసి చేసింది. అయితే నందమూరి హీరో బాల‌య్య‌తో శ్రీదేవి సినిమా చేయ‌క‌పోయిన కూడా ఆమె కూతురు నంద‌మూరి హీరో అయిన ఎన్టీఆర్ తో క‌లిసి దేవ‌ర అనే చిత్రం చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...