Home Film News Mega Family: అక్కినేని ఫ్యామిలీ బాట‌లో మెగా ఫ్యామిలీ.. ఫ్లాపుల‌కి బ్రేక్ వేసేది ఎవ‌రు?
Film News

Mega Family: అక్కినేని ఫ్యామిలీ బాట‌లో మెగా ఫ్యామిలీ.. ఫ్లాపుల‌కి బ్రేక్ వేసేది ఎవ‌రు?

Mega Family: అక్కినేని ఫ్యామిలీ నటులు ఇటీవ‌ల వరుసగా నష్టపోతున్నారు. ఏ ఒక్క‌రు కూడా మంచి విజ‌యాన్ని అందుకోలేక‌పోతున్నారు .భారీ అంచ‌నాల‌తో వారి సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నా కూడా పూర్తిగా నిరాశ‌ప‌రుస్తున్నాయి. సీనియర్ నటుడు నాగార్జున  చేసిన సినిమాలను ప్రేక్షకులు ఇటీవ‌ల ఏ మాత్రం ఆదరించడం లేదు. ఆయన కుమారులు నాగ చైతన్య , అఖిల్‌లను కూడా ప్రేక్షకులు తిరస్క‌రిస్తున్నారు.  అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలు పరాజయం పాలవ్వడంతో ఈ ఫ్యామిలీకి చెందిన ముగ్గురు హీరోలు తమ భవిష్యత్తుపై ఆలోచనల్లో పడ్డారు. ఒకప్పుడు నాగార్జున సినిమాలంటే.. జనాలు ఎగ‌బ‌డి చూసేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఇక నాగ చైత‌న్య  మజిలీ’, ‘లవ్‌స్టోరీ’ తర్వాత స్క్రిప్ట్‌ ఎంపికలో కాస్త త‌డ‌బ‌డుతున్నాడు.

‘థ్యాంక్యూ’ సినిమా కొంతమంది  పర్వాలేదు అన్నప్ప‌టికీ  చిత్రం ఫెయిల్యూర్‌గానే మిగిలింది.. ఇక ‘కస్టడీకి మిశ్రమ స్పందన వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లుకూడా రాలేదు. ఇక అఖిల్ అక్కినేని ఇప్పటికీ టాలీవుడ్‌లో సరిగా స్థానం ద‌క్కించుకోలేదు. బ్యాచిలర్ సినిమా కాస్త పర్వాలేదు అనిపించిన మిగ‌తావి మాత్రం దారుణంగా నిరాశ‌ప‌ర‌చాయి. ఇప్పుడు ఇదే ట్రాక్‌లో  మెగా ఫ్యామిలీకి కూడా దూసుక‌పోతుంది. ఆ ఫ్యామిలీ హీరోలు సాలిడ్ హిట్ కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.  2023 స్టార్టింగ్‌లో వాల్తేరు వీర‌య్య చిరు విజ‌యం సాధించిన అందులో కొంత ర‌వితేజ‌కి కూడా వెళ్లింది. ఇక ఈ సినిమా త‌ర్వాత   పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయితేజ్‌ కలిసి చేసిన సినిమా బ్రో విడుద‌లైంది.

ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకి రాగా, అంత‌గా అలరించ‌లేక‌పోయింది.  ఇక‌ చిరంజీవి భోళా శంకర్‌తో బంపర్‌ హిట్‌ ఇస్తారని  అంద‌రు భావించారు. ఈ సినిమాని చూసి ప్ర‌తి ఒక్క‌రు చిరుపై విమ‌ర్శ‌లు కురిపించారు. ఇలాంటి స‌బ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నావ‌ని మండిప‌డ్డారు. ఇక  కాబోయే పెళ్లికొడుకు గాండీవధారి అర్జునతో అయినా ఫ్యామిలీకి ఒక్క మంచి హిట్ ఇస్తార‌ని మెగా ఫ్యాన్స్ భావించారు. కాని వారి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయి. టిక్కెట్ డ‌బ్బులు దండ‌గా అని సినిమా చూసిన వాళ్లు అనుకున్నారు. ఇక  ఇప్పట్లో అయితే మెగా ఫ్యామిలీ నుంచి చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు కాని మ‌రి ఎవ‌రు ఈ ఫ్లాప్ ట్రాక్‌కి బ్రేక్ వేస్తార‌నేది హాట్ టాపిక్‌గా మారింది

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...