Home Film News ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి రెండేళ్లు!
Film News

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకి రెండేళ్లు!

2 years for agent sai srinivasa athreya

డిటెక్టివ్ పాత్రలో అందరినీ ఆశ్చర్యపరిచిన నటుడు నవీన్ పోలిశెట్టి. స్వరూప్ దర్శకత్వం వహించిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఒక భిన్నమైన కథగా, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ రివ్యూలు సంపాదించిన ఈ సినిమా గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకుందాం. 2019 జూన్ 21 న పెద్దగా అంచనాలేమీ లేకుండా విడుదలైంది ఈ సినిమా. కానీ ఆ తర్వాత వచ్చిన స్పందన మాత్రం మామూలుగా లేదు. నవీన్ నటనకి ఏ మాత్రం తిరుగు లేదు. నెల్లూరులో పెద్ద డిటెక్టివ్ గా మారిపోవాలి అనుకునే ఒక సామాన్యుడైన ఆత్రేయ అందరిచేతా తక్కువగా చూడబడుతూ చివరికి ఒక క్లిష్టమైన మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అనేది కథాంశం.

ఇకపోతే నటిగా కనిపించిన శృతి శర్మ కూడా బాగా నటించింది. ఫన్ తో పాటు మంచి సస్పెన్స్ ని కూడా సినిమా ఆద్యంతం కొనసాగేలా చేస్తుంది. సినిమా బాగా ఆడటంతో వచ్చిన లాభాలు కూడా బాగున్నాయి ఈ సినిమాకి. సినిమాని కొన్న వాళ్లకి దాదాపు రెండు కోట్ల లాభాన్ని మిగిల్చింది. సినిమాని వాళ్ళు నమ్మినందుకు ఏ మాత్రం నష్టపోకుండేలా చేసింది. నవీన్ ఆ సినిమా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ గా మారుతూనే వచ్చాడని చెప్పచ్చు. ఈ మధ్య విడుదలైన ‘జాతి రత్నాలు’ పెద్ద హిట్ అయిపోయి.. నవీన్ ని మరింత మెరుగైన నటుడిగా చూపించింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...