Home Film News Bro Dialogue: బ్రో నుండి లీకైన స్ట‌న్నింగ్ డైలాగ్.. తేజ్‌తో ప‌వ‌న్ అలా అంటాడా..!
Film News

Bro Dialogue: బ్రో నుండి లీకైన స్ట‌న్నింగ్ డైలాగ్.. తేజ్‌తో ప‌వ‌న్ అలా అంటాడా..!

Bro Dialogue: ప్ర‌స్తుతం మెగా అభిమానుల‌తో పాటు సినీ ప్రియులు కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. చివ‌రిగా భీమ్లా నాయ‌క్ చిత్రంతో ప‌ల‌క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు బ్రో అనే చిత్రంతో ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. డివోషనల్ కాన్సెప్టుతో సోషియో ఫాంటసీ జోనర్‌లో దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ‘వినోదయ సీతమ్’కు రీమేక్‌గా తీస్తున్నారు. జూలై 28న సినిమాని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తుండ‌గా, ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. చిత్రం నుండి నేడు ఓ సాంగ్ రిలీజ్ చేయ‌నున్నారు.

అయితే ఈ చిత్రంలో ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న విష‌యం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ మార్క్ అలియాస్ మార్కండేయుడి పాత్రను పోషిస్తుండ‌గా, పవన్ కల్యాణ్ ‘కాలుడు’ అనే పాత్ర‌తో అల‌రించ‌నున్నాడు. కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ క‌ళ్యాణ్‌ – సాయి తేజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయట. ప‌వ‌న్ ప్ర‌తి సారి కూడా ‘మైడియర్ మార్కండేయ మంచిమాట చెబుతా రాసుకో’ అని చెబుతాడట. ఈ డైలాగ్ వింటుంటే ‘గబ్బర్ సింగ్’ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంద‌ని, ఆ సినిమా మాదిరే ఇది కూడా హిట్టే అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఈ సినిమాకి సంబంధించిన విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు ఫ్యాన్స్ కి ఫుల్‌గా న‌చ్చేశాయి. మామ‌, అల్లుళ్ల గెట‌ప్స్ కేక పుట్టించేలా ఉన్నాయ‌ని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌లుగా కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తోన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ అందిస్తున్నారు. ఇక సినిమాకి పాపులర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. రీ ఎంట్రీ త‌ర్వాత వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఈ సినిమా కూడా మంచి విజ‌యం అందిస్తుంద‌ని అంటున్నారు.

Related Articles

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...