Home Film News ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ ల 15 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్!
Film News

ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ ల 15 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్!

Aamir and Kiran are Divorced

ఇప్పుడు బాలీవుడ్ లో ఒకే ఒక్క హాట్ టాపిక్.. ఆదర్శ జంటగా పిలిపించుకున్న ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ లు విడిపోయారు. ఇది వాళ్ళిద్దరి అంగీకారంగా జరుగుతున్నట్టు ఒక పబ్లిక్ నోటీస్ రిలీజ్ చేశారు.

“ఈ పదిహేనేళ్లలో మేం చాలా అనుభవాలు ఎదుర్కున్నాం. ఎంతో సంతోషంగా గడిపాం. మా రిలేషన్ షిప్ ఎప్పుడూ నమ్మకం, గౌరవం, ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉండింది. కానీ ఇప్పుడు మేం జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని అనుకుంటున్నాం. అందుకే విడిపోవాలని నిశ్చయించుకున్నాం. మా ఇద్దరి మధ్య ఒక బాబు ఉన్నాడు కాబట్టి.. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. మేం తల్లి దండ్రులుగా కొనసాగుతాం. కానీ భార్యా భర్తలుగా మాత్రం కాదు. నిజానికి మేం విడిపోవాలని చాలా కాలమే డిసైడ్ అయ్యాం. కానీ, దానికి ఇదే పర్ఫెక్ట్ టైమ్ అని అనిపిస్తోంది. మా కొడుకు ఆజాద్ కి బాధ్యతా యుతంగా తల్లిదండ్రులుగా వ్యవహరిస్తాం. మా ఈ కొత్త ప్రయాణానికి సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. వాళ్ళ సహాయం లేకుండా.. ఇలా విడిపోగలిగే అవకాశం మాకు దొరికేది కాదు. కానీ, ఈ విడాకులు అనేవి మా జీవితంలో ఒక ముగింపు కాదు. ఇది లైఫ్ లో ఒక కొత్త ప్రయాణానికి ఆరంభం.” అని వాళ్ళు రాసుకున్నారు.

ఆమిర్ ఖాన్ కి ఇవి రెండో విడాకులు. ఇంతకు ముందు రీనా దత్తా అనే లేడీని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా దాదాపు 15 ఏళ్ల జీవితం కొనసాగాక వాళ్ళ మధ్య తేడాలు వచ్చాయి. ఆమిర్ ఖాన్ స్వయంగా 2002 లో విడాకులకి అప్లై చేసాడు. కానీ, వాళ్లిద్దరికీ ఉన్న ఇద్దరు పిల్లలని రీనా దత్తా మాత్రమే తన అధీనం లోకి తీసుకుంది. 2005 లో కిరణ్ రావ్ తో జత కలిసిన ఆమిర్ 2011 లో సరోగసి ద్వారా ఆజాద్ కి జన్మనిచ్చారు. ఐతే, వీళ్ళిద్దరూ ఉన్నపళంగా విడిపోవడం అందరినీ ఆలోచనలో పడేసింది. కొంతమంది దీనిని లవ్ జిహాద్ తరహా విషయంలా కూడా చూస్తున్నారు. మరి కొంతమంది.. ఆమిర్ ఖాన్ ఇంకో కొత్త హీరోయిన్ తో రిలేషన్ లో ఉండడం వల్ల కిరణ్ టాటా చెప్పేస్తుంది అని భావిస్తున్నారు. ఎవరి ఊహాగానాలు ఎలా ఉన్నా ఈ పదిహేనేళ్ళు వాళ్ళిద్దరి జంట నిజంగానే ఆదర్శంగా అనిపించింది. ఒకే మతానికి చెందిన వాళ్ళు కాకపోయినా.. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఇన్నేళ్ళు కలిసి ఉండడం కచ్చితంగా గొప్ప విషయమేనని.. వాళ్ళ ప్రస్తుత నిర్ణయాన్ని సమర్తిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అమెరికన్ హిట్ ‘forrest gump’ కి రీమేక్. ఈ సంవత్సరం చివరి నాటికి ఆ సినిమాని ప్రేక్షకులకి అందించే ఆలోచనలో ఉంది మూవీ టీం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...