Home Film News Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్‌ని డైరెక్ట్‌గా అన్న ఇంటికే తీసుకెళ్లిన జాన్వీ క‌పూర్.. అడ్డంగా బుక్ అయిందిగా..!
Film News

Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్‌ని డైరెక్ట్‌గా అన్న ఇంటికే తీసుకెళ్లిన జాన్వీ క‌పూర్.. అడ్డంగా బుక్ అయిందిగా..!

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా కూడా ఈ అమ్మ‌డు మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తూ నానా ర‌చ్చ చేస్తుంది. బోల్డ్ అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి అయితే కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూడ‌గా, దేవ‌ర సినిమాతో ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌ని కూడా ప‌ల‌క‌రించ‌నుంది.   ఎన్టీఆర్ తో కలిసి ‘దేవర’ అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

ఇక జాన్వీ క‌పూర్ ప్రేమాయ‌ణంకి సంబంధించి ఇటీవ‌ల అనేక వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఆమె శిఖర్ పహారియాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు కొంతకాలంగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ వీడియో ఆ వార్తలు నిజమేనని తేలిపోయింది. వివ‌రాల‌లోకి వెళితే జాన్వీ క‌పూర్ సోద‌రుడు అర్జున్ కపూర్ త‌న నివాసంలో స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల‌కి ఆతిథ్యం ఇచ్చారు. అర్జున్  ఆతిథ్యాన్ని స్వీకరించ‌డానికి జాన్వీ కపూర్, ఆమె రూమర్స్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా, నటుడు వరుణ్ ధావన్, అతడి భార్య నటాషా దలాల్ ఉన్నారు. అయితే  జాన్వీ కపూర్, శిఖర్ ఒకే కారులో త‌న సోద‌రుడి ఇంటికి వెళ్ల‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఇద్ద‌రు వైట్ డ్రెస్ లో మెరిసారు. జాన్వీ అయితే  పొట్టి దుస్తులలోమెర‌వ‌గా, శిఖర్ తెల్లటి షర్ట్‌ లో క‌నిపించాడు. ఇద్దరు ఒకే కారులో వెనుక సీటులో కూర్చిని ఉండ‌గా, కెమెరాలు వారిద్దరిని బంధించే ప్ర‌య‌త్నం చేసాయి. ఆ స‌మ‌యంలో ఆమె కెమెరాల నుండి  తప్పించుకోవడానికి విండో షీల్డ్ ఉన్న కిటికీ వైపు కాస్త  జరిగింది.  ఇక ఇటీవ‌ల జాన్వీ ఓ తెలుగు హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉంద‌నే ప్ర‌చారాలు వ‌చ్చాయి. కాని వాటిని జాన్వీ అభిమానులే కొట్టి ప‌డేసారు. ప్ర‌స్తుతం ఈ భామ బాలీవుడ్ చిత్రం బావాల్ చిత్ర ప్ర‌మోష‌న్‌తో బిజీగా ఉంది.   జూలై 21న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై జాన్వీ భారీ అంచనాలే పెట్టుకుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...