Home Film News ఇక ‘మా’ ఎన్నికల్లోకి సోనూ సూద్ కూడా వచ్చాడంటే..
Film News

ఇక ‘మా’ ఎన్నికల్లోకి సోనూ సూద్ కూడా వచ్చాడంటే..

Sonu May Consider Participating In MAA Elections

సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య మంచి పనులు చేసి బాగా పాపులర్ అయిపోయాడు. కొంతకాలం క్రితమే నెల్లూర్ వాసులకి ఆక్సిజన్ ప్లాంట్ పంపించి రియల్ హీరో అనిపించుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడు కూడా చేయని మంచి పనులు అతను చేస్తూ ఉండటం అందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతలా జనాల హృదయాలలో చోటు సంపాదించాడు సోనూ.

ఐతే, అతను సినిమా వాడు కాబట్టి ఈ మధ్య చర్చకి వచ్చిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో సోనూ సూద్ ప్రస్తావన కూడా వస్తుంది. ఇప్పటిదాకా సోనూ సూద్ చేసిన మంచి పనులు.. సినిమా వాళ్ళని కూడా బాగా ఆకర్షించాయి. అసలు ఎలాంటి అధికారం లేకుండా సోనూ సూద్ ఇలాంటి ధోరణి కలిగి ఉన్నాడంటే.. ఇక నిజంగా అతనికి ఏదైనా అధికారం ఉంటే ఇంకా ఎంత మంచి పని చేస్తాడోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ ఎలాంటి మంచి పనులు చేయలేకపోతున్నారని అనిపించుకుంటున్న మా లీడర్స్ కి పోటీగా సోనూ సూద్ వస్తే ఎంత బాగుంటుందన్న వాదన వినిపిస్తోంది. పైగా లోకల్, నాన్ లోకల్ అంటూ ఏదీ ఉండదని కూడా నిరూపితం ఐపోయింది.

ఈ మధ్యనే కేటీఆర్ ని కలిసిన సోనూ సూద్ రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసే అవకాశం లేకపోలేదు అని భావిస్తున్నారు. నెల్లూర్ తన స్వంత ఊరు కాకపోయినా.. స్వంత డబ్బులు పెట్టుకుని సాటి మనిషికి సహాయం చేస్తున్న సోనూ సూద్.. తోటి సినిమాలకి అధికారం ద్వారా ఇంకెంత సహాయం చేస్తాడు కదా అని అనుకుంటున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...