Home Film News Dasara Director: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ద‌స‌రా డైరెక్ట‌ర్..వేడుక‌కి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!
Film News

Dasara Director: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న ద‌స‌రా డైరెక్ట‌ర్..వేడుక‌కి ఎవ‌రెవ‌రు హాజ‌ర‌య్యారంటే..!

Dasara Director: ఇటీవ‌ల టాలీవుడ్‌లో హిట్ అయిన సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ద‌స‌రా ఒక‌టి. ఈ మూవీలో నాని, కీర్తి సురేష్ త‌మ ప‌ర్‌ఫార్మెన్స్ తో ఇర‌గ‌దీసారు. వారి న‌ట‌న‌తో పాటు ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌కు సినిమా సూప‌ర్ హిట్ అయింది.  ఈ సినిమా నాని కెరీర్‌లోనే ఫస్ట్ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డుఉల క్రియేట్ చేసింది నాని గ‌త చిత్రాలు ఈ రేంజ్‌లో వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేద‌ని టాక్. అయితే ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు చాలా అద్భుతంగా తెర‌కెక్కంచ‌గా,  ఆయ‌న‌ని చాలా మంది ప్ర‌శంసించారు. మంచి ఫ్యూచ‌ర్ ఉంద‌ని కూడా అన్నారు. అయితే ద‌స‌రా చిత్ర ద‌ర్శ‌కుడు  శ్రీకాంత్ ఓదెల రీసెంట్‌గా ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం (మే 31) అతని పెళ్లి  ఘ‌నంగా జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా పెళ్లయిన జంట ఫొటోను నేచురల్ స్టార్ నాని ట్విటర్ లో పోస్ట్ చేస్తూ…. “మన శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నాడు.. మీ అందరి ప్రేమ, దీవెనలు పంపించండి” అనే క్యాప్షన్ తో పిక్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

ప్ర‌స్తుతం శ్రీకాంత్ ఒణిదెల పెళ్లికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.  అయితే దర్శకుడు  శ్రీకాంత్ ఓదెల పెళ్లి తన సొంత ఊరు అయిన   గోదావరిఖనిలో అట్ట‌హాసంగా జరిగింది. నిజానికి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లిగానే చెబుతున్నా.. దాని వెనుక పెద్ద క‌థే ఉంద‌ని అంటున్నారు. శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో కాదు.. అతని స్నేహితుల్లో ఒకరైన శివ అనే వ్యక్తి చెల్లెల‌ని అంటున్నారు. ఆమెతో పరిచయం కూడా అనుకోకుండా జరిగిందే. శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో తన రెమ్యునరేషన్ ను తన ఫ్రెండ్స్ అకౌంట్లలో వేసేవాడని కొందరు అంటున్నారు.

అయితే ద‌ర్శ‌కుడు  పెళ్లికి నేచురల్ స్టార్ నాని   హాజరు కావాల్సి  ఉన్నా అనుకోలేని పరిస్థితుల వలన హాజరు కాలేదని టాక్. అయితే మొన్నటి వరకు ముంబై లో కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొని పూర్తి చేసిన నాని తాజాగా పూణేలో యాడ్ ఫిల్మ్ కోసం వెళ్లిన‌ట్టు తెలుస్తుంది. దీంతో శ్రీకాంత్ ఒదేల పెళ్ళికి నాని  హాజరు కాలేకపోయాడని అంటున్నారు.  అయితే పెళ్లికి హాజ‌రు కాలేక‌పోయిన కూడా  అతనికి ప్రత్యేకంగా విషెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ కూడా శ్రీకాంత్ కి స్పెషల్ గా విషెస్  చెప్పార‌ని అంటున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...