Home Film News Mahesh Babu: సినిమాలు ఫ్లాప్ అవుతాయ‌ని తెలిసి కూడా మ‌హేష్ చేసిన సినిమాలు ఏవంటే..!
Film News

Mahesh Babu: సినిమాలు ఫ్లాప్ అవుతాయ‌ని తెలిసి కూడా మ‌హేష్ చేసిన సినిమాలు ఏవంటే..!

Mahesh Babu: కృష్ణ న‌ట‌వార‌సుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌లోకి బాల న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేష్ బాబు ఆ త‌ర్వాత హీరోగా మారి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు. మ‌హేష్ బాబు న‌టించిన ఒక్క‌డు,పోకిరి సినిమాలు ఆయ‌న‌కు మాస్ ఫాలోయింగ్ కూడా తెచ్చిపెట్టాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్న మ‌హేష్ బాబు త్వ‌ర‌లో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మార‌బోతున్నాడు. రాజ‌మౌళి, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న ప్రాజెక్ట్ హాలీవుడ్ త‌ర‌హాలో తెర‌కెక్క‌నుండ‌గా, ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానులు అయితే క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు.

 

మ‌హేష్ బాబు కెరీర్‌లో సూప‌ర్ హిట్సే కాదు, కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంద‌ని తెలిసిన కూడా మ‌హేష్ బాబు ఓకే చేశాడ‌ట‌. మ‌హేష్ బాబు- తమిళ దర్శకుడు మురగదాస్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స్పైడ‌ర్ చిత్రం భారీ అంచ‌నాల‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. కాని అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఈ చిత్రం చేసే స‌మ‌యంలోనే మహేష్ బాబుకి ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసిన కూడా ఓకే చేశాం కాబట్టి నటించక తప్పదు అని సినిమాలో నటించారట. అయితే చిత్రం రిలీజ్ అయిన త‌ర్వాత మూవీకి మ‌రింత నెగెటివ్ టాక్ రావ‌డం మ‌హేష్‌ని బాధించింది.

 

ఇక శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబు కాంబినేషన్లో వ‌చ్చిన‌ బ్రహ్మోత్సవం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాలో నటించే సమయంలో మహేష్ బాబుకు ఎవ‌రు ఊహించ‌ని షాక్ తగిలింది. ఈ సినిమా మధ్యలోనే స్క్రిప్ట్ మొత్తం పూర్తి కాలేదని మహేష్ బాబుకు తెలియ‌డంతో చాలా సీరియ‌స్ అయ్యాడ‌ట‌.. స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాతనే కదా సినిమాలు ప్రారంభించాలి అని ద‌ర్శ‌కుడికి వార్నింగ్ ఇచ్చాడట మహేష్ బాబు. ఇక ఈ సినిమా హిట్ కాదని మహేష్ బాబుకి తెలిసిన కూడా త‌ప్ప‌క న‌టించాడు.. ఇక రిలీజ్ త‌ర్వాత చిత్రం తాను అనుకున్నట్టుగానే ప్రేక్ష‌కుల‌ని నిరాశ‌ప‌ర‌చింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...