Home Film News Ram Charan-Minister Roja: రామ్ చ‌ర‌ణ్ నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తొచ్చాయి అంటూ మంత్రి రోజా ట్వీట్
Film News

Ram Charan-Minister Roja: రామ్ చ‌ర‌ణ్ నిన్ను ఎత్తుకున్న రోజులు గుర్తొచ్చాయి అంటూ మంత్రి రోజా ట్వీట్

Ram Charan-Minister Roja: 11ఏళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు త‌ల్లిదండ్రులు కావ‌డంతో ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల‌లోనే కాక ప‌లు ఇంగ్లీష్ మీడియా సంస్థ‌లు ఈ వార్త‌ని హైలైట్ చేశాయి. చిరంజీవి ఎప్పుడైతే ఉపాస‌న ప్ర‌గ్నెంట్ అని ప్ర‌క‌టించారో అప్ప‌టి నుండి వారికి సంబంధించిన వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతూనే ఉన్నాయి. ఇక జూన్ 20 తెల్ల‌వారుఝామున ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఉపాస‌న‌తో పాటు రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి దంప‌తుల‌కి కూడా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక వైసీపీ మంత్రి రోజా త‌న సోష‌ల్ మీడియాలో వెరైటీగా శుభాకాంక్షలు తెలియ‌జేసి వార్త‌ల‌లో నిలిచింది.

రామ్ చరణ్ చిన్న తనంలో ఆయన్ను ఎత్తుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ రోజా ట్వీట్ చేసింది. చిరంజీవి గారు తాత అయినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మంచి మనసు, ఎనర్జీతో కూడిన వ్యక్తిత్వంగల మీ కుటుంబంలోకి ఒక లవ్లీ మెగా ప్రిన్సెస్‌ రావడం ఒక ఆశీర్వాదం. డియర్ రామ్ చరణ్.. నువ్వు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను నా చేతులతో ఎత్తుకున్న రోజులు ఏమాత్రం మర్చిపోలేను. ఇప్పుడు ఆ రోజులు మళ్లీ గుర్తొచ్చాయి. నీకు ఇప్పుడు కూతురు పుట్టడం మరింత ఆనందంగా ఉంది.. చిరంజీవి సర్.. మీకు తాత అనే ప్ర‌మోష‌న్ పొందిన‌ప్ప‌టికీ మీరొక ఎవర్ గ్రీన్ హీరో. అలాగే ఉపాసన కొణిదెల, మీ ఇంటి చిట్టి మహాలక్ష్మికి నా ఆశీస్సులు అంటూ మంత్రి రోజా త‌న ట్వీట్‌లో తెలియ‌జేశారు.

 

ప్ర‌స్తుతం చిరంజీవి త‌మ్ముడు వైసీపీ నాయ‌కుల మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న స‌మ‌యంలో మంత్రి రోజా.. చిరు ఫ్యామిలీపై ఇంత ఎమోష‌న‌ల్‌గా ట్వీట్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రోజా, చిరు క‌లిసి చాలా హిట్ సినిమాల‌లో క‌లిసి ప‌ని చేశారు. ఇక చిరంజీవి త‌మ్ముడు నాగేంద్ర‌బాబుతో కొన్నేళ్ల‌పాటు జ‌బ‌ర్ధ‌స్త్ షో చేసింది రోజా. మంత్రిగా ప్ర‌మోష‌న్ పొందాక బుల్లితెర‌కు, వెండితెర‌కి దూర‌మైంది రోజా. ఆమె తిరిగి బుల్లితెర‌పై సంద‌డి చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి ఆ కోరిక ఎప్పుడు తీరుస్తుందో చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...