Home Film News Rakul Preet: ఆయ‌న‌తో ముద్దు సీన్ చేయ‌డం వ‌ల్ల‌నే ఆఫ‌ర్స్ త‌గ్గాయి అంటూ ర‌కుల్ హాట్ కామెంట్స్
Film News

Rakul Preet: ఆయ‌న‌తో ముద్దు సీన్ చేయ‌డం వ‌ల్ల‌నే ఆఫ‌ర్స్ త‌గ్గాయి అంటూ ర‌కుల్ హాట్ కామెంట్స్

Rakul Preet: ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ ర‌కుల్‌కి ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలే లేకుండా పోయాయి. చిన్న హీరోల సినిమా అవ‌కాశాలు కూడా ఈ అమ్మ‌డికి ద‌క్క‌డం లేదు. హిందీలో ప‌లు చిత్రాలు చేస్తున్న‌ప్ప‌టికీ అవి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో ర‌కుల్ తెగ అందాలు ఆర‌బోస్తూ అవ‌కాశాలు ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది.ఘాటెక్కించే అందాల‌తో అభిమానులని ఇంప్రెస్ చేస్తుంది కాని, నిర్మాత‌ల దృష్టి పెద్ద‌గా ఆక‌ర్షించ‌లేక‌పోతుంది. రకుల్ చివరగా టాలీవుడ్‌లో మన్మథుడు 2, చెక్, కొండపొలం వంటి చిత్రాల్లో నటించింది. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత నిరాశ‌ప‌ర‌చాయో మ‌నం చూశాం.

అయితే తాజా ఇంట‌ర్వ్యూలో ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న‌కు అవ‌కాశాలు త‌గ్గ‌డంపై ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. సౌత్‌లో ఒక‌ప్పుడు నాకు అవ‌కాశాలు బాగా వ‌చ్చేవి. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో వ‌రుస ప‌రాజ‌యాలు న‌న్ను ప‌ల‌క‌రించాయి. అందుకు కార‌ణం ఒక సీనియ‌ర్ హీరోతో ముద్దు సీన్ లో న‌టించ‌డం వారికి న‌చ్చ‌క‌పోవ‌డ‌మే అనుకుంటా. ఆ చిత్రం చాలా నిరాశ‌ప‌ర‌చింది. ఆ త‌ర్వాత అవ‌కాశాలు కూడా పూర్తిగా త‌గ్గాయి అని చెప్పుకొచ్చింది. ర‌కుల్ కామెంట్స్ తో ఆ సీనియ‌ర్ హీరో ఎవ‌రా అని తెగ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే ఆ సీనియ‌ర్ హీరో నాగార్జున‌నే అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

సౌత్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌న్మ‌థుడు2 చిత్రంలో మాత్రమే ముద్దు సీన్ చేసింది. హిందీ అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరోతో రొమాంటిక్ గా నటించిన‌ప్ప‌టికీ, ఈ అమ్మ‌డు సౌత్ గురించి మాట్లాడింది కాబట్టి రకుల్ చేసిన వ్యాఖ్యలు నాగార్జునని ఉద్దేశించే అని ప‌లువురు ముచ్చ‌టించుకుంటున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ తెర‌కెక్కించిన మ‌న్మ‌థుడు 2 చిత్రంలో మన్మథుడు 2లో రకుల్ ముద్దు సీన్లు, స్మోకింగ్ సీన్లలో చాలా బోల్డ్ గా నటించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మన్మథుడు 2 చిత్రం విడుదలయ్యాక విప‌రీత‌మైన ట్రోలింగ్ కూడా న‌డిచింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...