Home Film News Rajamouli – Anupam Kher : రాజమౌళి గురించి అనుపమ్ ఖేర్ ఎంత బాగా చెప్పారో తెలుసా!
Film News

Rajamouli – Anupam Kher : రాజమౌళి గురించి అనుపమ్ ఖేర్ ఎంత బాగా చెప్పారో తెలుసా!

Rajamouli - Anupam Kher
Rajamouli - Anupam Kher

Rajamouli – Anupam Kher: దర్శకధీరుడు రాజమౌళి తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా సినిమాకీ తనతో తానే పోటీ పడుతూ.. ప్రతి సినిమాకీ కొత్తగా ఏదోటి నేర్చుకుంటూ.. ప్రేక్షకులను సరికొత్త ఫీల్‌ని, థ్రిల్‌ని కలిగిస్తుంటారాయన.

‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ చూసి తెలుగు సినిమాల్లో ఈ రేంజ్ సీజీ వర్కా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ‘బాహుబలి’ (రెండు పార్టులు), ‘ఆర్ఆర్ఆర్’ తో తెలుగు సినిమాకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని, గౌరవాన్ని తీసుకొచ్చారు.

రీసెంట్‌గా సీనియర్ బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, రాజమౌళిని కలిశారు. ఇద్దరూ చాలా సేపు ముచ్చటించుకున్నారు. ఈ సందర్భంగా జక్కన్నను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు అనుపమ్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రాజమౌళి.. అనుపమ్ శాలువా కప్పుతుంటే మొహమాటపడ్డారు.

‘‘ప్రియమైన రమాజీ మరియు రాజమౌళి మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.. హైదరాబాద్‌లోని మీ నివాసంలో పెట్టిన రుచికరమైన భోజనానికి థ్యాంక్స్.. సాంప్రదాయకంగా శాలువా కప్పి మీ ఇంట్లోకి మిమ్మల్ని స్వాగతించడాన్ని చాలా సంతోషించాను. ఐ లవ్ యువర్ సింప్లీసిటీ అండ్ హ్యుమిలిటీ.. ఐ ఫీల్ బ్లెస్డ్.. మీనుంచి చాలా నేర్చుకోవాలి’’ అంటూ అనుపమ్ ట్వీట్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...