Home Film News Karate Kalyani: నా కారు టైర్స్ కోసి న‌న్ను చంపాల‌ని అనుకున్నారు.. క‌రాటే క‌ళ్యాణి షాకింగ్ కామెంట్స్
Film News

Karate Kalyani: నా కారు టైర్స్ కోసి న‌న్ను చంపాల‌ని అనుకున్నారు.. క‌రాటే క‌ళ్యాణి షాకింగ్ కామెంట్స్

Karate Kalyani: ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో భిన్న‌మైన పాత్ర‌లు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందిన క‌రాటే క‌ళ్యాణి ఇప్పుడు వివాదాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తుంది. ఇటీవ‌ల దివంత అగ్ర న‌టుడు ఎన్టీఆర్‌ను కించ‌ప‌రిచేలా కామెంట్స్ చేసిన కార‌ణంగా ఆమెని  మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్  స‌స్పెండ్ చేశారు. అంతేకాదు ఆమె మెంబ‌ర్‌షిప్‌ను కూడా ర‌ద్దు చేశారు. ఈ క్ర‌మంలో కరాటే క‌ళ్యాణి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఎన్టీఆర్‌పై గ‌తంలో చాలా మంది అనేక అభ్యంత‌ర కామెంట్స్ చేసిన కూడా వారంద‌రిని వ‌దిలిపెట్టి త‌న‌ను మాత్ర‌మే ఎందుకు  టార్గెట్ చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. త‌మ ఫ్యామిలీ మొత్తం ఎన్టీఆర్ అభిమానుల‌మేన‌ని  చెప్పుకొచ్చింది.

రీసెంట్‌గా క‌రాటే క‌ళ్యాణి ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ..  కొంద‌రు తనపై దాడులకు ప్రయత్నించారని,  చంపడానికి కూడా యత్నించారని తెలిపింది. ఇటీవ‌ల కొంద‌రు దుండ‌గులు తన కారు రెండు టైర్లను  కోసేశారని వెల్లడించింది. ఇటీవ‌ల హిందుత్వ వాదులతో కలసి  ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే తన కార్ లో వెళ్లామని, అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నపుడు తన కార్ టైర్ పేలిపోయిందని  క‌ళ్యాణ‌ఙ చెప్పుకొచ్చింది. వాస్తవానికి అదే టైరు ఏ హైవే మీద వెళ్తున్నపుడో కనుక  పేలి ఉంటే  ఎంతపెద్ద ప్ర‌మాదం జ‌రిగి ఉండేది.  కార్ టైరు చూసిన మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని అన్నార‌ని,  తన మీద కోపం తోనే ఎవరో ఇలా చేశారంటూ వాపోయింది క‌రాటే క‌ళ్యాణి.

ఇక ఎన్టీఆర్ వివాదం గురించి మాట్లాడుతూ.. కృష్ణుడికి ఒక రూపం ఉందని ఆయన రూపంలో మనుషుల  విగ్రహాలు పెట్టడం ఏ మాత్రం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో  శ్రీకృష్ణుడే తనకు అండగా ఉంటారని, అందుకే కోర్టు రెండు సార్లు స్టే విధించిందని కూడా తెలియ‌జేసింది. ఎన్టీఆర్‌కి మా ఫ్యామిలీ పెద్ద అభిమానులు. ఆ స్థానంలో ఎవ‌రు ఉన్నా కూడా పోరాడేదానిన‌ని క‌రాటే క‌ళ్యాణి చెప్పుకొచ్చింది. మా అసోసియేషన్ నుంచి  త‌న‌ను తీసేయడం వలన పెద్దగా న‌ష్టం  ఏమీ లేదని తెలిపింది. హిందుత్వ వాదిగా, యాదవ సంఘం నాయకురాలిగా తనకు మంచి ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...