Home Film News నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్…కాజల్ కామెంట్స్ తో యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌ మతులు పోయే హంగామా..!
Film News

నా ఫేవరెట్ హీరో ఎన్టీఆర్…కాజల్ కామెంట్స్ తో యంగ్ టైగ‌ర్ ఫ్యాన్స్‌ మతులు పోయే హంగామా..!

మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మన టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు ఉంటారు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ పాన్ ఇండియా మూవీ త్రిబుల్ ఆర్ తో ఎన్టీఆర్ క్రేజ్‌ ఏకంగా ఆస్కార్ రేంజ్ కి వెళ్ళింది. అదేవిధంగా కోలీవుడ్ పరిశ్రమ నుంచి దళపతి విజయ్ కూడా తిరిగిలేని స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

బాక్సాఫీస్ కలెక్షన్ల పరంగా, సోషల్ మీడియా రికార్డులు.. లక్షల్లో అభిమానులు ఇవన్నీ టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు కోలీవుడ్లో విజయ్‌కు సొంతం. అలాంటి ఈ ఇద్దరు అగ్ర హీరోలతో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోయిన్లు, దర్శకులు పనిచేశారు.. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కూడా అందుకున్నారు. అలాంటి ఈ ఇద్దరితో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నటించింది. మరి ముఖ్యంగా ఎన్టీఆర్‌కు కాజల్ బాగా కలిసి వచ్చిన హీరోయిన్ అని చెప్పాలి.. ఎన్టీఆర్- కాజల్ అగర్వాల్ కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

Happy Birthday Kajal Aggarwal: Check Out Her Elegant Photos and How She  Built a High-End Status – FilmiBeat

అయితే ఇప్పుడు తాజాగా కాజల్ మీ ఇద్దరి హీరోలపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో తన అభిమానులతో ఇంట్రక్షన్లో ఇప్పటివరకు మీరు నటించిన హీరోల్లో మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా ప్రశ్న ఆమెకు ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం అంటూనే తన ఫేవరెట్ కోలీవుడ్‌లో దళిపతి విజయ్, టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు కాజల్‌ను ఆకాశానికి ఎతేస్తు సోషల్ మీడియాలో ఎంతో రచ్చ చేస్తున్నారు. అదేవిధంగా కాజ‌ల్‌ ప్రశంస‌ల‌ వర్షం కురిపిస్తున్నారు. కాజల్- ఎన్టీఆర్ సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...