Home Film News ఆ ఇద్దరూ హీరోయిన్లు కలిసి నటిస్తే సినిమా ఫ్లాప్ నా.. ఆ స్టార్ హీరోల‌ని కూడా నిండా ముంచేశారుగా..!
Film News

ఆ ఇద్దరూ హీరోయిన్లు కలిసి నటిస్తే సినిమా ఫ్లాప్ నా.. ఆ స్టార్ హీరోల‌ని కూడా నిండా ముంచేశారుగా..!

90వ ద‌శ‌క‌మంలో యూత్ లో పిచ్చి క్రేజ్ తెచ్చుకున్నా హీరోయిన్ ఎవరంటే నగ్మా అని అందరూ చెబుతారు.. గ్లామర్ పాత్రలో ఆమెను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి టాలీవుడ్ స్టార్‌ హీరోలతో ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. నగ్మా.. సరదా బుల్లోడు, మేజర్ చంద్రకాంత్ ఘరానా మొగుడు, అల్లరి అల్లుడు వంటి సినిమాలతో అప్పటి యూత్ కి బాగా దగ్గరయింది. అప్పట్లో నగ్మాకి పోటీగా సౌందర్య తెలుగింటి అమ్మాయిల అమ్మోరు, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, రాజా వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

Manam News

నగ్మా- సౌందర్య ఇద్దరు 90లో సౌత్ ఇండియన్ సినిమాలను ఒక ఊపు ఊపారు. వీరిద్దరూ విడిగా నటించిన ఎన్నో సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే మాత్రం ఆ సినిమాలు ప్లాప్‌ గా మిగిలిపోయాయి. అలాంటి వాటిలో కె. మురళి మోహన్ రావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. సురేష్ బాబు నిర్మించిన సినిమా సూప‌ర్ పోలిస్‌.. 1994లో వ‌చ్చిన ఈ సినిమా తెలుగుతో పాటో కోలీవుడ్‌, బాలీవుడ్‌లో విడుద‌లైంది.

అంతే కాకుండా ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. వెంకటేష్, నగ్మా, సౌందర్య క‌లిసి నటించారు. అన్ని భాషల్లోనూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్ట‌ర్‌ గా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత మళ్లీ నగ్మా- సౌందర్య కలిసి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమాలో నటించారు. శ్రీ క్రాంతి చిత్ర బ్యానర్, క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో “రిక్షావోడు” విడుదలైంది. ఈ సినిమాలో నగ్మా, సౌందర్య హీరో, హీరోయిన్లుగా నటించారు.

ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేశారు. చిరంజీవి రిక్షావోడుగా మాస్ లుక్ తో అభిమానులను అలరించినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ప్లాప్‌గా మిగిలిపోయింది. ఇలా ఒక ఏడాది గ్యాప్ లోనే నగ్మా ,సౌందర్య కలిసి నటించిన సూపర్ పోలీస్, రిక్షావోడు వంటి సినిమాలు ఫెయిల్యూర్ కావడంతో ఆ తర్వాత అప్ప‌టి స్టార్‌ ద‌ర్శ‌కులు వారు చేసే ఏ సినిమాలో కూడా నగ్మా, సౌందర్యల‌ను కలిపి తీసుకోలేదట.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...