Home Film News Rana Charan: చదువుకునే రోజుల్లో రానా, చ‌ర‌ణ్ అంత‌టి ప‌ని చేశారా.. విష‌యం బ‌య‌ట‌పెట్టిన చిరు
Film News

Rana Charan: చదువుకునే రోజుల్లో రానా, చ‌ర‌ణ్ అంత‌టి ప‌ని చేశారా.. విష‌యం బ‌య‌ట‌పెట్టిన చిరు

Rana Charan: ఎంత‌టి సెల‌బ్రిటీ పిల్ల‌లైన తుంట‌రి ప‌నులు చేయ‌కుండా ఉంటారా చెప్పండి.చిన్న‌ప్పుడు రానా-రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రు క‌లిసి నానా ర‌చ్చ చేసే వార‌ట‌. ఈ ఇద్ద‌రు చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. అలానే మంచి ఫ్రెండ్స్ కూడా. ఈ విషయాన్ని వారు ప‌లు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే చ‌దువుకునే రోజుల‌లో రామ్ చ‌ర‌ణ్‌, రానా ఇద్ద‌రు క‌లిసి రాత్రిళ్లు కంబైన్డ్ స్ట‌డీస్ చేశార‌ట‌.  ఆ స‌మ‌యంలో వారు చేసిన ఓ తుంట‌రి పని గురించి చిరంజీవి ఓ సంద‌ర్భంలో చెప్పుకు రాగా, ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

సాధార‌ణంగా ఫ్రెండ్స్ అన్న త‌ర్వాత క‌లిసి తిన‌డం, తిర‌గ‌డం ఇంకా ఏవేవో చిలిపి చేష్ట‌లు చేయ‌డం స‌హ‌జ‌మే. సెల‌బ్రిటీల పిల్ల‌లు కూడా ఇందుకు అతీతులేమి కాదు.  రామ్ చరణ్ – రానా  ఇద్దరు కలిసి కంబైన్ స్టడీస్ చేసే స‌మ‌యంలో గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకొని కొంత సేపు చదువుకున్నట్టు నటించేవారట. అనంతరం కిటికీలకు ఉండే గ్రిల్స్ ఓపెన్ చేసి.. మెల్ల‌గా బయటికి వెళ్లిపోయేవారట. అలా బయటకి వెళ్లిన‌ప్పుడు చాలా సేపు తిరిగేసి, సరదా షికార్లు కొట్టి.. మళ్లీ ఏమీ తెలియనట్లు ఆ గ్రిల్స్ ద్వారా ఇంట్లోకి వచ్చి సైలెంట్ గా చదువుకుంటున్నట్టు నటించేవారట. ఇలా  ప్ర‌తి సారి చేస్తుండ‌గా, ఓ సారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికార‌ట‌. ఈ విష‌యాన్ని చిరంజీవి ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చారు.

ఇక ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్, రానా పాన్ ఇండియా స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. బాహుబ‌లి సినిమాతో రానాకి ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ ద‌క్కింది. మనోడు ప్ర‌ధాన పాత్ర‌లో సినిమాలు చేస్తూనే మ‌ల్టీ స్టార‌ర్ సినిమాల‌లోను న‌టిస్తున్నాడు. ఇక రానా విష‌యానికి వ‌స్తే ప్రముఖ‌ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేయ‌నుండ‌గా,  ఇందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  రామ్ చ‌ర‌ణ్ కి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...