Home Film News ఆ హిస్టారికల్ కథతో బాలయ్య సినిమా.. ఆ చరిత్ర ఏమిటి.. డైరెక్టర్ ఎవరంటే..!?
Film News

ఆ హిస్టారికల్ కథతో బాలయ్య సినిమా.. ఆ చరిత్ర ఏమిటి.. డైరెక్టర్ ఎవరంటే..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాల నుంచి జానపద, చారిత్రక, భక్తి రసాత్మకం అన్ని రకాల సినిమాల్లో నటించిన ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే.. ఆరేళ్ల‌ క్రితం ఆయన 100 సినిమాగా వచ్చిన హిస్టారికల్ మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యం అందుకున్నాడు. ఈ సినిమాతో బాలయ్య విమర్శకుల ప్రశంసలందుకోవడంతోపాటు కమర్షియల్ గా కూడా తిరగలేని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.

Akhanda Trailer: మీకు సమస్య వస్తే దండం పెడతారు.. మేం ఆ సమస్యకే పిండం  పెడతాం: పవర్ ఫుల్ డైలాగులతో కేక పుట్టించిన బాలయ్య - Telugu News | Nandamuri  Balakrishna Akhanda ...

శాతకర్ణి సినిమా తర్వాత మళ్లీ బాలయ్య హిస్టారికల్ కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆయనకు కాలం కలిసి రాలేదు.. అదే సమయంలో ఎన్నికలు, రాజకీయాలు కరోనా ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు. మరి ముఖ్యంగా అఖండ సినిమా తర్వాత బాలయ్య క్రేజ్ ఎవరు ఊహించిన విధంగా మారింది. ఒకప్పుడు బాలయ్య సినిమా వస్తుందంటే ఎవరూ పట్టించుకోని వాళ్ళు అప్పుడు బాలయ్య సినిమా అంటే సూపర్ హిట్ అంటూ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇదే సమయంలో బాలయ్య సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా అదరగొడుతున్నాడు. అందుకే బాల‌య్య‌ చేయాలనుకున్న హిస్టారికల్ సినిమా కాస్త వాయిదా పడుతూ వచ్చింది.. శతాబ్దాల క్రితం తెలుగు నేలను పాలించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయలు కథతో బాలయ్య సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం బాలయ్య మెగాదర్శకుడు బాబి తో తన 109వ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

Hero Turning As Devaraya For Govt Event

ఈ సినిమా తర్వాత యాక్షన్ దర్శకుడు బోయపాటి శ్రీను తో అఖండ2ను మొదలు పెట్టబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో సినిమాలు చేయడానికి ఎందరో దర్శకులు క్యూలో ఉన్నారు.. వారిలో అఖండ2 తర్వాత ఎవరికి ఒకే చెప్తారు అన్న సస్పెన్షన్ అయితే ప్రస్తుతానికి ఉంది. ఇక ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయులు జీవిత చరిత్ర ఆధారంగా రాబోయే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం మాత్రం శాతకర్ణి సినిమాను సూపర్ హిట్ చేసిన దర్శకుడు క్రిష్ కే ఇస్తారని తెలుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...